చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ సినిమాలు అతి తక్కువ గ్యాప్ లో విడుదల అవ్వడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. రీసెంట్ గా ‘బ్రో’ మరియు ‘భోళా శంకర్’ సినిమాలు కేవలం రెండు వారాల గ్యాప్ తో విడుదల అయ్యాయి. ‘బ్రో ది అవతార్’ చిత్రానికి పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్స్ రాగ, ‘భోళా శంకర్’ చిత్రానికి డిజాస్టర్ కలెక్షన్స్ వచ్చాయి. బ్రో చిత్రానికి మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, భోళా శంకర్ చిత్రానికి ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిలు వచ్చాయి.
ఇది మెగాస్టార్ కి (Chiranjeevi) ఘోరమైన పరాభవం అనే చెప్పాలి. అయితే ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిల్చింది. అయితే విడుదలై ఇన్ని రోజులు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ కాలేదేంటి అని అందరూ అనుకుంటూ ఉన్నారు.
ఎట్టకేలకు ఈ సినిమా టెలికాస్ట్ ఈ దసరా కి జెమినీ టీవీ లో ప్రసారం కాబోతుంది. ఇది మెగా ఫ్యాన్స్ కి శుభ వార్తే, కానీ అదే రోజు జీ తెలుగు ఛానల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం టెలికాస్ట్ కానుంది. ఒకే రోజు అన్నదమ్ముల సినిమా టెలికాస్ట్ అవ్వడం విశేషం.
కానీ ఒకే సమయం లో టెలికాస్ట్ అయితే మాత్రం ఇద్దరి సినిమాలకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. సాధారణంగా కొత్త సినిమాలు సాయంత్రం సమయం లోనే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రెండు సినిమాలు ఒకే సమయం లో సాయంత్రం ఆరు గంటల ప్రాంతం లో టెలికాస్ట్ కానున్నాయి. మరి ఈ టెలివిజన్ పోటీ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !