యంగ్ డైరెక్టర్ పెళ్లికి రెడీ!

గతేడాది విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటించింది. ఇదే సినిమాలో రీతూవర్మకి స్నేహితురాలిగా నిరంజని అగత్యాన్ అనే అమ్మాయి నటించింది. ఆమెది కూడా హీరోయిన్ రోల్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈమె పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఆమె వివాహం చేసుకోబోయేది మరెవరినో కాదు.. ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు దేసింగ్ పెరియస్వామిని. అప్పటివరకు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన నిరంజనిని ఈ సినిమాతో నటిగా పరిచయం చేశాడు దర్శకుడు దేసింగ్ పెరియస్వామి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని తెలుస్తోంది. వారి రిలేషన్ ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకొని ఇంట్లో చెప్పడంతో.. పెద్దలో అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరికీ నిశ్చితార్ధం జరిపించారు. త్వరలోనే పెళ్లి వేడుక జరిపించాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ నిరంజని ఎవరో తెలుసా.. ఒకప్పుడు అజిత్ హీరోగా నటించిన ‘ప్రేమలేఖ’ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు అగత్యాన్ చిన్న కూతురు. అగత్యాన్ కి ముగ్గురు కూతుర్లు. మొదటి కూతురు దర్శకుడు తిరుని పెళ్లి చేసుకుంది. రెండో కూతురు ఫిరోజ్ అనే తమిళ దర్శకుడిని పెళ్లాడింది. ఇప్పుడు మూడో కూతురు కూడా దర్శకుడినే పెళ్లి చేసుకోబోతుంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus