ఆఫర్లు లేకపోయినా తగ్గని కాజల్

ఆకాశంలో చందమామ కొన్నాళ్లు మెరిసి పోతుంది.. కొన్నాళ్లు కళ తగ్గిపోతుంది. అంతమాత్రాన చందమామ అందం తగ్గదు. అదే తరహాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఆఫర్ల జోరు తగ్గిందేమో కానీ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఏజ్ పెరిగినా.. జోరు తగ్గినా తీసుకునే రెమ్యునరేషన్ లో మాత్రం ఇప్పటికీ మెట్టు దిగనంటే దిగనని పట్టు పట్టుకుని దానిని సాధించుకోగలగడం కాజల్ కే చెల్లింది. ఏదైనా సినిమాలో హీరోయిన్ చేయడానికి సైన్ చేయాలంటే కాజల్ ఇప్పటికీ కోటి రూపాయలకు పైనే డిమాండ్ చేస్తోందని టాలీవుడ్ టాక్. అదే సీనియర్ హీరోలైతే ఈ మొత్తం ఇంకాస్త పెరుగుతుందట. తెలుగులో ఈ రేంజిలో పారితోషికం తీసుకునే హీరోయిన్లు అతి తక్కువ. కానీ ఇప్పుడు సీనియర్ కథానాయకులకు హీరోయిన్ల కొరతే పెద్ద సమస్య. వీళ్ల ఇమేజ్ కు తగ్గ హీరోయిన్లు దొరకడం కాస్త కష్టంగానే ఉంటోంది.

అదీగాక కాజల్ అందానికి ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా దర్శక-నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత చేసినా డేట్ల కోసం ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కాజల్ తాజాగా తెలుగులో నందమూరి కళ్యాణ్ రాంతో ఎం.ఎల్.ఎ. (మంచి లక్షణాలున్న అబ్బాయి).. నాని ప్రొడ్యూస్ చేస్తున్న అ! సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గినా వరస హిట్లు వరిస్తుండటం ప్లస్ పాయింట్ అవుతోంది. లాస్ట్ ఇయర్ కాజల్ తెలుగు రెండు తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తే అందులో రెండు బ్లాక్ బస్టర్లయ్యాయి. దీనిని బట్టి లక్ ఆమెకు ఏ రేంజిలో కలిసొస్తోందో అర్ధం చేసుకోవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus