సౌందర్య ఆస్తుల లెక్క ఎంతో తెలుసా?

సావిత్రి, శ్రీదేవి ల.. తరువాత మన టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆరాధించే నటి ఎవరైనా ఉన్నారా అంటే.. కచ్చితంగా సౌందర్య అనే చెప్పాలి. గ్లామర్ పాత్రలకు అతీతంగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరో చిన్న హీరో అని లేదు..సినిమాలో తన పాత్ర నచ్చితే ఎలాంటి హీరో, డైరెక్టర్ ప్రాజెక్టు లో అయినా నటించడానికి ఈమె ఓకే చెప్పేసేదట.ఇది పక్కన పెట్టేస్తే.. ఈమె లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయి 16ఏళ్ళు పూర్తవుతున్నా..

ఈమె ఆస్తుల లెక్కలు మాత్రం ఇంకా తేలలేదని తెలుస్తుంది. సౌందర్య 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈమెతో పాటు.. ఇతని అన్నయ్య కూడా కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉండగా.. సౌందర్య ఆస్తుల లెక్క 100కోట్ల వరకూ ఉంటుందట. కరెక్ట్ టైంలో ఆమె సంపాదన చాలా వరకూ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టడం వల్ల అంత పెద్ద మొత్తం ఉంటుందని సమాచారం. అయితే ఆస్తుల విభజన విషయంలో సౌందర్య తల్లిదండ్రుల కు అలాగే ఆమె వదినకు మధ్య తగాదాలు నడుస్తున్నాయట.

2009 లో అది కోర్టు వరకూ వెళ్ళడం జరిగిందట. సగానికి పైనే ఆస్తులు పంచుకున్నప్పటికీ…. కొన్ని భూముల విషయంలో మాత్రం ఈ లెక్కలు తేలడం లేదట. కొంతమంది పెద్దల సమక్షంలో కూడా ఆస్తి పంపిణీల సంగతి తేల్చుకోవాలని భావిస్తున్నప్పటికీ.. వారి మధ్యలో మనస్పర్థలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయట. ఆమె పోయిన తరువాత కూడా ‘ఆస్తుల విషయంలో వారు ఇంకా ఇలా రోడ్డుకెక్కడం కరెక్ట్ కాదని’ కొందరు భావిస్తున్నారు.

1

2

3

4

5

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus