‘మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు.. లేని వాళ్లకు కొంత దానం చెయ్యాలి’.. ఇది ‘శ్రీమంతుడు’ సినిమాలో డైలాగ్. దీనిని నిజ జీవితంలో నటుడు సోనూ సూద్ పాటిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా.. ఎంతో మంది వలస కూలీలు తిండికి ఇబ్బంది పడుతుంటే.. వారికి ఆహరం పెట్టాడు. అంతేకాదు వాళ్లను సొంత ఊర్లకు పంపే సదుపాయాలు కల్పించాడు.వాళ్ళ కోసం ప్రత్యేకంగా బస్సులు వేయించాడు, ట్రైన్ వేయించాడు.. కొంతమంది మహిళలకు విమాన సదుపాయం కూడా కల్పించాడు.
ఈ లాక్ డౌన్ కాలంలో సోనూ సూద్ 10 కోట్లు వరకూ ఖర్చు చేసాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. తాజాగా రైతులకు ట్రాక్టర్లు పంపి.. వారి కష్టంలో పాలుపంచుకున్నాడు. ‘ఇంత చేస్తున్న సోనూ సూద్ కు ఆస్తి ఎక్కువగా ఉందా? అసలు అతని ఆస్తి ఎంత? అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. సోనూ సూద్ ఆస్తి కలిగిన కుటుంబం నుండీ వచ్చిన వ్యక్తి కాదు. సాధారణ కుటుంబం నుండీ వచ్చిన వ్యక్తే..! అతని ఆస్తి 130 కోట్లట. సినిమాల ద్వారానే అంత మొత్తం సంపాదించుకున్నాడట.
సినిమా సెలబ్రిటీలకు.. ఈ ఆస్తి చాలా తక్కువనే చెప్పాలి. సినిమాల్లో విలన్ గా నటించే సోనూ సూద్ నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. సోషల్ మీడియాలో అయితే ఇతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రేపు సోనూసూద్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అతని బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చెయ్యాలని కూడా నెటిజెన్లు భావిస్తున్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?