దేవ్ గిల్ (Dev Gill) … ‘మగధీర’ తో (Dev Gill) రాజమౌళి (SS Rajamouli) ఫేమస్ చేసిన విలన్. అయితే ఇతను టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నాగార్జున (Nagarjuna) – మంచు విష్ణు (Manchu Vishnu) కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణార్జున'(Krishnarjuna) సినిమాతో అని ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ‘మగధీర’ లో రఘువీర్/రణధీర్ బిల్లా పాత్రల్లో అతను అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా నటించాడు కానీ.. అవి ‘మగధీర’ రేంజ్లో ఇమేజ్ తెచ్చిన సినిమాలు కావు అనే చెప్పాలి. ఈ మధ్య ఇతనికి అవకాశాలు కూడా తగ్గినట్టు కనిపిస్తున్నాయి.
అందుకోసం ఇతను హీరోగా మారి ఓ పాన్ ఇండియా సినిమా చేసి వార్తల్లో నిలవాలని డిసైడ్ అయ్యాడు. మొత్తానికి ‘అహో విక్రమార్క’ అనే సినిమాతో ఇతను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘జువ్వ’ వంటి సినిమాలు తీసిన రాజమౌళి అసిస్టెంట్.. పేట త్రికోటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ‘దేవ్ గిల్ ప్రొడక్షన్స్’ బ్యానర్ ను స్థాపించి దేవ్ గిల్ భార్య ఆర్తి దేవేందర్ గిల్ ఈ చిత్రాన్ని మిహిర్ కులకర్ణి, అశ్విని కుమార్ మిశ్రా..లతో కలిసి నిర్మించారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు రూ.30 కోట్లు బడ్జెట్ అయ్యిందట. పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా ప్రకటించలేదు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అయితే చాలా రొటీన్ గా ఉంది. మరి రూ.30 కోట్ల బడ్జెట్ కి ఈ సినిమా న్యాయం చేస్తుందో లేదో చూడాలి.