దుమారం రేపుతున్న దేవదాస్ కలెక్షన్స్ పోస్టర్

ఈమధ్యకాలంలో సినిమా కలెక్షన్స్ విషయంలో జరిగేంత రచ్చ ఇండస్ట్రీలో ఇంకో విషయం మీద జరగలేదు. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడే పీపుల్స్ బ్లాక్ బస్టర్, సూపర్బ్ రెస్పాన్స్ అనీ పోస్టర్లు రిలీజ్ చేయడం చాలా కామన్. కానీ.. కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్స్ రిలీజ్ చేసి చెడ్డ పేరు మోస్తున్నారు. “భారత్ అనే నేను” సినిమా టైమ్ లో కూడా ఇలాగే జరిగింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చి, ప్రేక్షకాదరణ చూరగొంటున్న తరుణంలో అన్నీ వందల కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్ని వందల సెంటర్లలో ఆడింది అని రిలీజ్ చేసిన పోస్టర్స్ కారణంగా దర్శకనిర్మాతలు అభాసుపాలయ్యారు.

ఇప్పుడు ‘దేవదాస్” విషయంలోనూ అదే జరుగుతోంది. గత నెల విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. నాగార్జున-నానిల క్రేజీ కాంబినేషన్ వల్ల యావరేజ్ గా మిగిలిపోయింది కానీ.. సరైన కథ-కథనం లేని ఈ చిత్రం ఫ్లాప్ కి ఆమడ దూరంలో ఆగిపోయింది. అయితే.. సినిమాను జనాలు మర్చిపోతున్న తరుణంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ మా సినిమా 61 కోట్లు కలెక్ట్ చేసింది అని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఖంగుతినడమే కాక ఉన్నట్లుండి ఈ ఫేక్ కలెక్షన్స్ ఎందుకు చెప్పడం అని నాగార్జున అభిమానులందరూ కస్సుమన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus