అశోక్ గల్లా (Ashok Galla) ‘హీరో’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమా చేశాడు. మైథలాజికల్ టచ్ తో కూడిన కమర్షియల్ మూవీ ఇది. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. బోయపాటి శ్రీను శిష్యుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arun Jandyala) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ‘హనుమాన్’ (Hanu Man) తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఒకసారి (Devaki Nandana Vasudeva) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.11 cr |
సీడెడ్ | 0.01 cr |
ఆంధ్ర(టోటల్) | 0.11 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.23 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.03 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 0.26 cr (షేర్) |
‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.26 కోట్లు షేర్ ను రాబట్టింది. అవి కూడా నెగిటివ్ షేర్స్ వంటివి తీయకుండా..! ఏదేమైనా బ్రేక్ ఈవెన్ కి ఏకంగా రూ.5.24 కోట్ల షేర్ ను రాబట్టాలి..!