Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

‘దేవర’ సినిమా ఫలితం సంగతేమో కానీ.. ఆ సినిమా సీక్వెల్‌ వస్తుందా? లేదా? వస్తే ఎలా ఉంటుంది అనే చర్చే ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే తొలి సినిమాకు వచ్చిన స్పందనకు, వసూళ్లకు సీక్వెల్‌ వెంటనే మొదలైపోవాలి. ఆ సినిమా కోసం తారక్‌ పూర్తి టైమ్‌ ఇవ్వాలి. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా గురించి తారక్‌ అంటీముట్టనట్లుగానే ఉంటున్నాడు. అలా అని సినిమా ఆలోచన మానేశారా అంటే మొన్నీమధ్య ‘దేవర’ వచ్చి సంవత్సరం అయినందుకు శుభాకాంక్షలు చెబుతూ సీక్వెల్‌ ఉందని గుర్తు చేశారు.

Devara 2

తారక్‌ మౌనానికి, ఇప్పుడు సీక్వెల్‌ ముచ్చట్లకు మధ్యలో చాలానే జరిగింది అని సమాచారం. దర్శకుడు కొరటాల శివ అటు తిరిగి, ఇటు తిరిగి ఆఖరికి తారక్‌ దగ్గరకే వచ్చారు అని సమాచారం. ‘వార్ 2’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు.. ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌) పనులతో బిజీగా ఉన్న తారక్‌ సినిమాలకు ఈ మధ్య కాస్త గ్యాప్‌ సినిమాలకు ఇచ్చాడు. దీంతో ప్రశాంత్‌ నీల్‌ సినిమా మీద పుకార్లు మొదలయ్యాయి. అయితే ‘దేవర 2’ సినిమా ఉంది అని చెప్పకనే చెబుతూ ఓ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.

నిజానికి ‘దేవర’ సినిమా వచ్చిన తర్వాత కొరటాల ఓ కొత్త ప్రాజెక్ట్‌ కోసమే ప్రయత్నాలు చేశారు. తొలుత అల్లు అర్జున్‌కు ఓ కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్‌కి అంతా ఓకే అనుకున్నా ఇప్పట్లో బన్నీ డేట్స్‌ సెట్‌ అవ్వడం కష్టం కాబట్టి.. ఓ యంగ్‌ హీరోకు కథ చెబుతున్నారు అని మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ‘దేవర 2’ సినిమా పనులు మొదలయ్యేలోపు ఈ సినిమా పూర్తి చేసేలా చిన్న బడ్జెట్‌లో ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు బలంగా వినిపించాయి.

కానీ ఇప్పుడు ‘దేవర 2’ పనులు మొదలుపెట్టేద్దాం అని ఫిక్స్‌ అయ్యారట. అటు ఇటు తిరిగే కంటే ఈ సినిమానే పూర్తి స్థాయిలో రెడీ చేసుకొని పాన్‌ ఇండియా స్థాయిలో మార్పులు చేసుకుంటే ‘పుష్ప: ది రూల్‌’ తరహాలో హైప్‌, విజయం అందుకోవచ్చనే ఆలోచనలో ఇంక్లూజన్‌లు చేస్తున్నారని లేటెస్ట్‌ టాక్‌.

ఓ ‘ఇంటి’వాడైన ‘పెద్ది’ డైరక్టర్‌.. ఫొటోలు, వీడియోలు వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus