Devara: ‘దేవర’ శాటిలైట్ బిజినెస్ ఇంకా జరగలేదా?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘దేవర'(Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చింది సినిమా కూడా..! అయితే రిలీజ్ టైంకి ఈ సినిమాపై పెద్దగా బజ్ ఏమీ లేదు. మౌత్ టాక్ కొంత పర్వాలేదు అనిపించింది.మరోపక్క దసరా హాలిడేస్ కూడా కలిసి రావడంతో ‘దేవర’ బాక్సాఫీస్ పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Devara

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) కాకుండా ఎన్టీఆర్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు కొట్టింది. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ చేసిన నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. క్లైమాక్స్ లో లీడ్ కూడా ఇచ్చారు. అయితే ఓటీటీలో ‘దేవర’ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి 2 పార్టులు ఎందుకు అంటూ చాలా మంది విమర్శించారు. మరోపక్క ‘వార్ 2’ (War 2) షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వడంతో ‘దేవర 2’ ఉండదు అనే ప్రచారం కూడా జరిగింది.

కానీ ఆ ప్రచారాన్ని ఇటీవల ఎన్టీఆర్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. కచ్చితంగా ‘దేవర 2’ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశాడు. అదెప్పుడు వస్తుందో తెలీదు కానీ కచ్చితంగా ‘దేవర 2’ అయితే ఉంటుంది అనే క్లారిటీ వచ్చింది. ఇదిలా పక్కన పెడితే.. ‘దేవర’ రిలీజ్ అయ్యి 7 నెలలు పూర్తి కావస్తోంది. కానీ ఇంకా ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడుపోలేదు. ఇప్పటికీ ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ టెలికాస్ట్ అయ్యింది లేదు. ‘దేవర 2’ తర్వాత వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa 2) ఆల్రెడీ టీవీల్లో టెలికాస్ట్ అయ్యింది.

మరోపక్క రాంచరణ్ (Ram Charan)  ‘గేమ్ ఛేంజర్’ (Game changer) కూడా త్వరలోనే టెలికాస్ట్ కానుంది. కానీ ‘దేవర’ ఎందుకు ఇంకా టెలికాస్ట్ కాలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘దేవర’ కి ముందు కొరటాల చేసిన ‘ఆచార్య’ (Acharya) డిజాస్టర్ అయ్యింది. అందువల్ల ‘దేవర’ ని భారీ రేటు పెట్టి కొనడానికి శాటిలైట్ సంస్థలు ముందుకు రాలేదు. రిలీజ్ తర్వాత మంచి ఆఫర్లు వస్తాయిలే అని మేకర్స్ భావించారు. కానీ అది కూడా జరగలేదు. ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ కి శాటిలైట్ సంస్థలు కూడా వెనకడుగు వేసినట్టు స్పష్టమవుతుంది.

జస్ట్ ఓకే.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus