Devara Movie: దేవర మూవీ ఇంగ్లీష్ వెర్షన్ పై మేకర్స్ క్లారిటీ ఇదే.. ఏమన్నారంటే?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవర అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు సైతం ఉన్నాయని తెలుస్తోంది. అయితే తాజాగా ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా దేవర మూవీ రిలీజ్ కానుందని వార్త వైరల్ అయింది.

దేవర ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజైతే బాగుంటుందని అభిమానులు భావించారు. అయితే దేవర టీమ్ మాత్రం వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందిస్తూ వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించడం గమనార్హం. దేవర సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో గాసిప్స్ ఎక్కువగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. దేవర మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

దేవర (Devara Movie) సినిమా గ్లింప్స్ కు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేవర మూవీలో సాంగ్స్ అన్నీ అద్భుతంగా ఉండేలా అనిరుధ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కోలీవుడ్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచిన అనిరుధ్ టాలీవుడ్ లో సైతం నంబర్ వన్ గా నిలిచే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

దేవర సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా కొరటాల శివ, అనిరుధ్ అడుగులు వేస్తుండగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ఎక్కువగా క్లాస్ సినిమాలను తెరకెక్కించిన కొరటాల శివ ఇకపై ఊరమాస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. దేవర టాలీవుడ్ ఇండస్ట్రీ కమర్షియల్ సినిమాల లెక్కలను మారుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus