అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప'(సిరీస్) కి కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన ‘పుష్ప’ ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘పుష్ప 2’ అయితే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1500 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అక్కడే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం అనేది ఒక రికార్డు గా చెప్పుకోవాలి. అల్లు అర్జున్ అక్కడ సూపర్ స్టార్ అయిపోయాడు.
ఇక ‘పుష్ప 2’ సినిమా క్లైమాక్స్ లో ‘పుష్ప 3’ కూడా ఉంటుంది అని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ‘పుష్ప 3 – ది రాంపేజ్’ టైటిల్ ను కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా రావడానికి ఇంకో 3,4 ఏళ్ళు టైం పడుతుంది అని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్.. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలి.
ఇవి కంప్లీట్ అయ్యేసరికి కచ్చితంగా 2028 వరకు టైం పట్టొచ్చు. మరోపక్క సుకుమార్ కూడా రాంచరణ్, విజయ్ దేవరకొండ..లతో ఒక సినిమా చేయాలి. సో సుకుమార్ ఫ్రీ అవ్వడానికి కూడా 2028 వరకు టైం పట్టొచ్చు. సో చాలా టైం ఉన్నప్పటికీ ‘పుష్ప 3’ గురించి ఎక్కువ చర్చలు నడుస్తున్నాయి. ఏకంగా ‘పుష్ప 3’ ఐటెం సాంగ్ గురించి డిస్కషన్స్ జరుగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.
ఇటీవల సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను (Devi Sri Prasad) .. ‘పుష్ప 3’ ఐటెం సాంగ్ గురించి ప్రశ్నించారు. అందుకు అతను అందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నర్తిస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ‘పుష్ప’ ఐటెం సాంగ్లో సమంత, ‘పుష్ప 2’ ఐటెం సాంగ్లో శ్రీలీల (Sreeleela) నర్తించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 3’ ఐటెం సాంగ్లో జాన్వీ డాన్స్ చేస్తే అద్భుతమే కదా.