హీరో ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్..!

  • April 19, 2016 / 12:46 PM IST

సుకుమార్ దర్శకత్వంలో మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఓ చిత్రం రాబోతుందని, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని వార్తలు వినిపించాయి. తరువాత ఈ ప్రాజెక్ట్ పై ఎటువంటి అలికిడి లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అందరూ అనుకున్నారు.

అయితే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం అవుతుందని దేవి తెలిపాడు. పలు చిత్రాలు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నందున.. ఆ చిత్రాలు పూర్తి అయిన తరువాత హీరోగా తన ఎంట్రీ ఉంటుందని, సంగీతానికి తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చాడు దేవి. ప్రస్తుతం జనతాగ్యారేజ్ తో పలు చిత్రాలకు ఆయన స్వరాలు సమకూరుస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=XrmrT9_1k5k

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus