దేవి శ్రీ రెమ్యూనరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు కానీ..!

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవి శ్రీ ప్రసాద్ పేరే చెప్తారు. అయితే ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ఆయన హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. గతంలో అయితే ప్రతీ స్టార్ హీరో సినిమాకి దేవి శ్రీ ప్రసాదే చేసేవాడు. దీంతో అతని రెమ్యునరేషన్ కూడా మూడు కోట్లు అయిపొయింది. దర్శక నిర్మాతలు కూడా ఏమాత్రం వెనుకాడకుండా దేవి శ్రీ అడిగినంత ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అది చాలా ఎక్కువని దర్శకులు ఫీల్ అవుతున్నారట. అందుకు ముఖ్యకారణం దేవి శ్రీ.. ఈ మధ్యకాలంలో సరైన హిట్ ఆల్బం ఇవ్వకపోవడమే అని తెలుస్తుంది.

సాధారణంగా కొరటాల తన ప్రతీ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటూ ఉంటాడు. అయితే మెగాస్టార్ చిరంజీవితో చేసే సినిమాకి మాత్రం దేవి శ్రీ ని పక్కన పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇక దేవిశ్రీప్రసాద్ చేతిలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అలాగే వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, నితిన్ ‘రంగ్ దే’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం కూడా దేవి శ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ అని తెలుస్తుంది. మరో పక్క తమన్ 2 కోట్ల లోపే సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. కాబట్టి అతనినే ఎక్కువగా డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నారు.’వాల్మీకి’ ‘వెంకీమామ’ సినిమాల నుండీ దేవి శ్రీ ని తప్పించారు, అందుకు కారణం కూడా ఇదే అని తెలుస్తుంది. అయినప్పటికీ దేవి మాత్రం అస్సలు రెమ్యూనరేషన్ విషయంలో తగ్గడం లేదట. ఇప్పుడు దేవి కచ్చితంగా మంచి ఆల్బం ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి.. లేదా పారితోషికం అయినా తగ్గించుకోవాల్సి ఉంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus