దేవిశ్రీప్రసాద్

  • November 24, 2017 / 05:22 AM IST

స్పానిష్ మూవీ “కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్”తోపాటు కేరళ మరియు పాకిస్తాన్ లో జరిగిన కొన్ని అంశాల కథాంశంగా తీసుకొని శ్రీకిషోర్ తెరకెక్కించిన సస్పెన్స్ డ్రామా “దేవిశ్రీప్రసాద్”. భూపాల్, ధనరాజ్, మనోజ్ నందం, పూజా రామచంద్రన్ లు కీలకపాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం నేడు (నవంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

కథ : దేవి (భూపాల్ రాజ్), శ్రీ (మనోజ్ నందం), ప్రసాద్ (ధనరాజ్) ముగ్గురూ మంచి స్నేహితులు. దేవి ఆటో నడిపితే, శ్రీ టీ కొట్టు పెట్టుకొంటాడు, ప్రసాద్ ఒక హాస్పిటల్ లో వార్డ్ బోయ్ గా వర్క్ చేస్తుంటాడు. ఈ ముగ్గురికీ హీరోయిన్ తార (పూజ రామచంద్రన్) అనే విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే తమ ఏరియాలో తార షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని ఆమెను చూడ్డానికి వెళతారు. కట్ చేస్తే.. ఒక యాక్సిడెంట్ లో మరణించిన తార డెడ్ బాడీని ప్రసాద్ పనిచేసే హాస్పిటల్లో ఉంచబడుతుంది. మార్చురీలో తార డెడ్ బాడీని చూసిన ప్రసాద్ తన స్నేహితులను కూడా చూడ్డానికి రమ్మంటాడు. అయితే.. బ్రతికున్నప్పుడు తార ఒంటిపై చెయ్యేసే అవకాశం ఎలాగో రాదని, కనీసం శవంతోనైనా కోరిక తీర్చుకుంటానని అంటాడు దేవి. శ్రీకి ఈ విషయం నచ్చదు. మొదట్లో ఇబ్బందిపడినా తాను కూడా ఒకసారి ట్రై చేస్తానంటాడు ప్రసాద్. అయితే.. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కసారిగా లేస్తుంది తార, చనిపోయింది అనుకొన్న తార లేచి కూర్చునేసరికి దేవి-శ్రీ-ప్రసాద్ లకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితులు ఎక్కడికి దారి తీసాయి? చివరికి తార బ్రతికిందన్న నిజం ప్రపంచానికి తెలిసిందా లేదా? అనేది “దేవిశ్రీప్రసాద్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు : దేవిగా భూపాల్, శ్రీగా మనోజ్ నందం, ప్రసాద్ గా ధనరాజ్ లు తమ తమ పాత్రల్లో జీవించేశారు. ముగ్గురికీ సరిసమానమైన స్క్రీన్ ప్రెజన్స్ తోపాటు పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నారు. ముఖ్యంగా భూపాల్ రెండు టిపికల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించగా.. మంచోళ్ళుగా ధనరాజ్, మనోజ్ నందంలు పాత్రలకు న్యాయం చేశారు. “స్వామి రారా” ఫేమ్ పూజ రామచంద్రన్ ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. హీరోయిన్ గా హొయలు ఒలికించిన పూజా రామచంద్రన్, శవంగా భయాన్ని, నిస్సహాయురాలిగా జాలిని కలిగించింది. ఎమోషన్స్ల్ సీన్స్ లో బాగా నటించింది. సెల్ఫీ రాజా అనే పోలీస్ పాత్రలో పోసాని కృష్ణమురళి కామెడీతోపాటు కథను ముందుకు తీసుకెళ్ళాడు. కానిస్టేబుల్ గా భావన పారేపల్లి చిన్న పాత్రలోనూ ఆకట్టుకొంది.

సాంకేతికవర్గం పనితీరు : కమ్రాన్ సంగీతం, ఫణీంద్రవర్మ సినిమాటోగ్రఫీ “దేవిశ్రీప్రసాద్” సినిమాకి మెయిన్ హైలైట్స్. సినిమా మొత్తానికి రెండే పాటలున్నప్పటికీ తన నేపధ్య సంగీతంతో అలరించాడు కమ్రాన్. రెండు గంటల సినిమాలో దాదాపు గంటన్నర సినిమా మొత్తం ఒకే రూమ్ లో జరిగినప్పటికీ.. ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీలవ్వకుండా తన కెమెరా యాంగిల్స్ తో ఆకట్టుకొన్నాడు ఫణీంద్రవర్మ. కథను “కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్” అనే స్పానిష్ చిత్రం నుంచి స్ఫూర్తిగా తీసుకొన్న దర్శకుడు శ్రీకిషోర్ కథనం విషయంలో మాత్రం ఆ చిత్రాన్ని ఫాలో అవ్వకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా.. ఎవ్వరూ ఇబ్బందిపడకుండా రాసుకొన్నాడు. ఫస్టాఫ్ కాస్త స్లో అనిపించినా.. సెకండాఫ్ ను మాత్రం టైట్ స్క్రీన్ ప్లేతో రక్తి కట్టించాడు. అన్నిటికంటే కథను సుఖాంతం చేసిన విధానం బాగుంది.

అయితే.. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో నైట్ టైమ్ వార్డ్ బోయ్స్, సెక్యూరిటీ తప్పితే ఎవరూ కనిపించకపోవడం, అందరూ చనిపోయిందనుకొన్న తార ఉన్నట్లుంది ఎలా లేచింది? అనే విషయాలకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో కాస్త సెన్స్ మిస్ అవుతుంది. అయితే.. ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలు తెలుగులో ఇప్పటివరకూ రాకపోవడం, మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే అంశాలు ఓ మోస్తరుగా ఉండడం వల్ల “దేవిశ్రీప్రసాద్” మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను కాకపోయినా బి,సి సెంటర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ : ఈ తరహా కథాంశాలను హాలీవుడ్ లో చూడడమే తప్ప తెలుగులో కనీసం ఊహించడానికి కూడా ఎవరూ ధైర్యం చేయరు. కానీ, శ్రీకిషోర్ చాలా అడల్ట్ కంటెంట్ ను ఎలాంటి ఇబ్బందిలేని విధంగా తెరకెక్కించి ఒక మంచి ప్రయత్నం చేశాడు. అయితే.. ప్రొడక్షన్ వేల్యూస్ బాగుండి, కథనం ఇంకాస్త ఆసక్తికరంగా ఉండి ఉంటే సినిమా రిజెల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. బట్.. కంపల్సరీగా కాకపోయిన ఒకసారి చూడదగ్గ చిత్రం “దేవిశ్రీప్రసాద్”

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus