దేవి దాని కోసం కంగారు పడడం లేదు!
- June 16, 2016 / 09:59 AM ISTByFilmy Focus
“కుమారి 21 ఎఫ్” సక్సెస్ మీట్ లోనే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తాను త్వరలోనే ఓ చిత్రాన్ని నిర్మించనున్నానని దిల్ రాజు పబ్లిక్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. సదరు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఎప్పుడు మొదలెడతారు? అనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చలు కూడా జోరుగా సాగాయి.
అయితే.. దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా లేడని, ప్రస్తుతం తన చేతిలో ఉన్న బాలయ్య వందో సినిమా, చిరంజీవి 150వ సినిమాలతోపాటు మరికొన్ని వైవిధమైన చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడని, సదరు సినిమాలు పూర్తయ్యాకే హీరోగా తన ఎంట్రీ గురించిన నిర్ణయం తీసుకొంటాడని దేవి సన్నిహితులు చెబుతున్నారు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















