వెంకీ, వరుణ్ తేజ్ సినిమాకి సంగీతమందించనున్న దేవీ శ్రీ ప్రసాద్

పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మరో విజయాన్ని అందుకోవడానికి అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. అందుకు f2 అనే అటైటిల్ తో పాటు ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఇందులో ఫ్రస్ట్రేషన్ తో ఫన్ క్రియేట్ చేయడానికి వెంకటేష్, వరుణ్ తేజ్ సిద్ధంగా ఉన్నారు. వెంకీ గురు సినిమా తర్వాత బాగా అలోచించి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. దానిని త్వరగా కంప్లీట్ చేసి వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇందులో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించనుంది.

ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి తాజాగా మ్యూజిక్ డైరక్టర్ ని ఖరారు చేశారు. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచిన రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలకు సంగీతమందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి ఓకే చెప్పారు. దేవీ తన టీమ్ లో జాయిన్ కావడంతో డైరక్టర్ సంతోషంగా ఉన్నారు. రాక్ స్టార్ సంగీతం సినిమాకి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్ మొదలయిందని ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus