మెగా…’మ్యూజిక్’ స్టార్ట్ అయ్యింది!!!

సుప్రీం హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా మారి ఇండస్ట్రీలో కొన్ని ఏళ్ల పాటు టాప్ హీరోగా సాగిన మన మెగాస్టార్ చిరంజీవి అభిమానులకోసం ఏమైనా చేస్తారు అన్న వార్త నిజం కాబోతుంది. ఇంతకీ విషయంలోకి వెళితే…శంకర్ దాద జిందాబాద్ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి వెండితెరపై కనిపించాలని తన 150 వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని చూస్తున్నారు అన్న విషయాలు మనకు తెలిసినవే.

అయితే ఇదేక్రమంలో చిరు 150వ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా రెండు ఏళ్ల నుంచి అదిగో…ఇదిగో అంటూ ఊరిస్తున్న ఈ చిత్రం చివరకు రెడీ అవుతుంది. రీసెంట్‌గా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాగా.. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక కధ కూడా ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలో…ఈ సినిమా జెడ్ స్పీడ్ తో దూసుకుపోతుంది అనడానికి సింబల్ గా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ట్విటర్ లో ఒక ఫోటో ను పోస్ట్ చేశాడు. దీనితో ఈ సినిమాకు దేవి మ్యూజిక్ అందిస్తున్నాడు అన్న వార్త అర్ధం అయిపోతుంది. అయితే దేవి ట్వీట్ హల్‌చల్ చేస్తున్న సంధర్భంలో ఈ ట్వీట్ లో చెప్పిన మాటలు మెగా అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్నాయి…ఇంతకీ దేవి ట్వీట్ లో ఏముందంటే…దేవి మెగాస్టార్ తో సెల్‌ఫీ తో పాటు ‘విత్ ది బాస్ మెగాస్టార్… 150వ సినిమా తొలి రోజు డిస్కషన్స్, వెల్ కం బ్యాక్ సర్’ అంటూ ట్వీట్ లో తెలిపాడు. అంటే దీన్ని బట్టి సింహం సమరానికి సిద్దం అయ్యిందన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus