తేజు తమ్ముడి సినిమాలో హీరోయిన్ గా మలయాళం బ్యూటీ..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీగా ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మన లెక్కల మాష్టారు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది కూడా. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఇప్పటి వరకూ గాలించారు. ఈ చిత్రం జాలర్ల లైఫ్ స్టైల్ లో ఉంటుంది. కాబట్టి అంతే ‘రా’ పేస్ ఉండే అమ్మాయి అయితే కరెక్ట్ అని సుకుమార్ ఇప్పటి వరకూ గాలిస్తూ వచ్చాడు. ఫైనల్ గా హీరోయిన్ ను ఖరారు చేశారని తాజా సమాచారం. మలయాళ బ్యూటీ దేవిక సంజయ్ ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కు జోడీగా కనిపించనుంది.

ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ తమిళ మార్కెట్ ను బేస్ చేసుకుని అక్కడ కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ‘సుకుమార్ రైటింగ్స్’ ,’మైత్రి మూవీ మేకర్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో కానీ విడుదల చేయాలనీ ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందట. మొదటి చిత్రంతోనే నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రను ఎంచుకున్న వైష్ణవ్ తేజ్ కు కచ్చితంగా ఇది మంచి డెబ్యూ అవుతుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus