మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.అయితే డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. 13వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది.ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 15.55 cr |
సీడెడ్ | 6.15 cr |
ఉత్తరాంధ్ర | 3.90 cr |
ఈస్ట్ | 1.61 cr |
వెస్ట్ | 1.16 cr |
గుంటూరు | 1.62 cr |
కృష్ణా | 1.58 cr |
నెల్లూరు | 0.85 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 32.42 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.08 cr |
ఓవర్సీస్ | 2.39 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 37.89 cr (షేర్) |
‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.37.89 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.17.19 కోట్ల లాభాలను అందించింది. అవతార్ 2, 18 పేజెస్ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ ఇంత భారీగా కలెక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు.
13వ రోజున ఈ మూవీ రూ.70 లక్షల పైనే షేర్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఈ వీకెండ్ కూడా డీసెంట్ గా కలెక్ట్ చేస్తే.. రవితేజ కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ‘క్రాక్’ రికార్డ్ ను బద్దలుగొట్టడం ఖాయం.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?