Dhamaka Collections: 2 వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ధమాకా’..!

  • January 6, 2023 / 05:08 PM IST

మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.అయితే డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. 2 వారం కూడా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 15.81 cr
సీడెడ్ 6.27 cr
ఉత్తరాంధ్ర 3.96 cr
ఈస్ట్ 1.63 cr
వెస్ట్ 1.17 cr
గుంటూరు 1.64 cr
కృష్ణా 1.60 cr
నెల్లూరు 0.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 32.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.14 cr
ఓవర్సీస్ 2.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 38.58 cr (షేర్)

‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.2 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.38.58 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.17.88 కోట్ల లాభాలను అందించింది. అవతార్ 2, 18 పేజెస్ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ ఇంత భారీగా కలెక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు.

14వ రోజున ఈ మూవీ రూ.50 లక్షల పైనే షేర్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఈ వీకెండ్ కూడా డీసెంట్ గా కలెక్ట్ చేస్తే.. రవితేజ కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ‘క్రాక్’ రికార్డ్ ని బద్దలుగొట్టడం ఖాయం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus