మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. అయితే డిసెంబర్ 23న ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. మొదటి వారం చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 10.95 cr |
సీడెడ్ | 4.05 cr |
ఉత్తరాంధ్ర | 2.76 cr |
ఈస్ట్ | 1.18 cr |
వెస్ట్ | 0.89 cr |
గుంటూరు | 1.28 cr |
కృష్ణా | 1.20 cr |
నెల్లూరు | 0.64 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 22.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.09 cr |
ఓవర్సీస్ | 1.70 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 26.74 cr (షేర్) |
‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.26.74 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా బయ్యర్స్ కు రూ.6.04 కోట్ల లాభాలను అందించింది.
అవతార్ 2, 18 పేజెస్ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ ఇంత భారీగా కలెక్ట్ చేస్తుండడం అంటే మామూలు విషయం కాదు. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?