Dhanush, Aishwarya: పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ధనుష్ 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులు ఈ ఏడాది జనవరిలో విడాకులు తీసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు.ఇలా 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు ఎంతో షాక్ కి గురయ్యారు.

ఈ క్రమంలోనే ఈ దంపతులు తిరిగి కలుసుకుంటే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు ఆశపడ్డారు అయితే తాజాగా ధనుష్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కుమారుడికి తన పిల్లల భవిష్యత్తు ముఖ్యమంటూ ఈయన పరోక్షంగా వీరి విడాకుల గురించి మాట్లాడుతూ విడాకులు రద్దు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.ఇలా వీరి విడాకులు రద్దు విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇంకా మీరు మాత్రం ఎలాంటి అధికారక ప్రకటన తెలియజేయలేదు.

ఇకపోతే విడాకులు తీసుకున్న ఈ జంట తన పిల్లల భవిష్యత్తును ఆలోచించి వారికోసం విడాకుల నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని భావించి తిరిగి కలుసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో ఈ జంట తన పిల్లలతో కలిసి ఓ కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. విడాకులను రద్దు చేసుకున్న తర్వాత ఐశ్వర్య ధనుష్ ఇద్దరు కలిసి కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

గత కొద్దిరోజులుగా ధనుష్ 100 కోట్ల రూపాయలు విలువైన ఇంటిని కొనుగోలు చేశారనే విషయం పెద్ద ఎత్తున వార్తల్లో వైరల్ అయింది. ఈ క్రమంలోనే జనవరి నెలలో తన కుటుంబ సభ్యులతో కలిసి ధనుష్ ఈ కొత్త ఇంట్లో ఉండబోతున్నారని కోలీవుడ్ మీడియాల, పలు వెబ్ సైట్ పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంకా ఈ దంపతులు ఈ వార్తలపై ఏ విధంగాను స్పందించలేదు. ఏది ఏమైనా మొత్తానికి ఈ దంపతులు కలుసుకోబోతున్నారంటే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus