Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్ హీరో కామెంట్స్ వైరల్
- June 9, 2026 / 04:41 PM ISTByFilmy Focus Desk
మనం ఏదైనా ఆటను టీవీలోనో, మొబైల్‌లోనే చూస్తున్నప్పుడు అతను సరిగ్గా ఆడకపోతే తిట్టుకుంటాం. ఇలా చేశాడేంటి అని విసుక్కుంటాం. ఈ క్రమంలో ఆ ప్లేయర్ కష్టం ఆ కాసేపు మరచిపోతాం. మళ్లీ కొన్ని రోజుల తర్వాత అతను బాగా ఆడితే మళ్లీ మెచ్చుకుంటాం. మన లాగే ప్రముఖ నటుడు ధనుష్ కూడా టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌పై అరిచేశాడట. దాని గురించి ఇటీవల చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నాదల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Rafael Nadal
నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన ‘రఫా’ డాక్యుమెంటరీని ధనుష్ (Dhanush) చూశాడట. ఆ విషయం గురించి చెబుతూ డాక్యుమెంటరీ చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. ఈ డాక్యుమెంటరీ చూశాకే నాదల్ ఎదుర్కొన్న ఇబ్బందులు అర్థమయ్యాయని తెలిపాడు. ‘రఫా’ డాక్యుమెంటరీ చూడటం గొప్ప అనుభూతి. టెన్నిస్ కోర్టులో నాదల్ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఓటమి చూసిననప్పుడు అభిమానిగా నేను ఆయనను విమర్శించినందుకు బాధపడుతున్నా అని చెప్పాడు ధనుష్.

మ్యాచ్‌లో నాదల్ పాయింట్లు కోల్పోయినప్పుడు.. మ్యాచ్ ఓడినప్పుడు టీవీ ముందు కూర్చొని గట్టిగా అరిచేవాడిని. అప్పుడు ఆయన మీద కోపం వచ్చేసింది. కానీ ఆ సమయంలో నాదల్ ఎంతటి నొప్పిని, ఒత్తిడిని భరిస్తూ ఆడారనేది తెలియదు. ఆ భారాన్ని నాదల్ ఎలా మోశాడో ఈ డాక్యుమెంటరీ చూశాకే అర్థమైంది అని ధనుష్ చెప్పాడు. అన్ని కష్టాలు, ఇబ్బందులు దాటుకొని వచ్చాడు కాబట్టే.. ఇప్పుడు అతను కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచాడు అని మెచ్చేసుకుననాడు.

‘రఫా’ డాక్యుమెంటరీ మే 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అందులో నాదల్ విజయాలు, కెరీర్‌లోని మలుపులు, జయాపజయాలను వివరంగా చూపించారు. సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు మించిన ఆదరణతో ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతోంది. రఫేల్ నాదల్‌ను అభిమానించేవారికి తెలియని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి.
స్కిన్ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్.. ‘పెద్ది’ని టార్గెట్ చేశారా?











