వీఐపీ కోసం ఎంతమంది ముద్దుగుమ్మలో..!
- November 24, 2016 / 10:44 AM ISTByFilmy Focus
తమిళ నాట నిత్యం సినిమాలతో గడిపే ప్రముఖులలో ధనుష్ ఒకరు. హీరోగా నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్నాడు. ఈ సంవత్సరంలో విడుదలైన ధనుష్ సినిమాల్లో ‘తొడరి’ (తెలుగులో ‘రైల్’) పెద్దగా ఆడకపోయినా మొన్నామధ్య వచ్చిన ‘కొడి’ (తెలుగులో ‘ధర్మయోగి’) మంచి విజయం సాధించింది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ధనుష్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘వీఐపీ’ సినిమాకి సీక్వెల్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్ల జాబితా రోజు రోజుకూ పెరిగిపోతోంది.
మొదటి భాగంలో నటించిన అమల పాల్ రెండో భాగంలోనూ కొనసాగనుండగా, మరో హీరోయిన్ గా కాజల్ పేరు వినిపిస్తోంది. ఈ ఇద్దరూ సరిపోరన్నట్టు ‘సాహసం..’ సినిమాతో లీగ్ లోకి వచ్చిన మంజిమ కూడా ‘వీఐపీ2’ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. అటు గౌతమి తనయ సుబ్బులక్ష్మి కి కూడా ఈ సినిమాలో ధనుష్ అవకాశం ఇచ్చినట్టు గుసగుసలు వస్తున్నాయి. ఇందరి పేర్లు తెరమీదికి రావడానికి అసలు కారణం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు ప్రాధ్యానం ఉందట. అయితే వీరిలో ఆ ముగ్గురు ఎవరన్నది ధనుష్ నిర్ణయించాల్సి ఉంది. గౌతమ్ మీనన్ సినిమాతో పాటు తొలిసారి మెగాఫోన్ పట్టి ‘పవర్ పాండి’ సినిమా చేస్తోన్న ధనుష్ వెంట్రిమారన్ దర్శకత్వంలో ‘వడ చెన్నై’ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇన్ని సినిమాల మధ్య ‘వీఐపీ 2’ ఎప్పుడు మొదలవుతుందో..?
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















