ధనుష్ తెలుగు డెబ్యూ కోసం నాగార్జున!

కొత్త దర్శకులను, కాన్సెప్ట్స్ ను మాత్రమే కాదు సరికొత్త కాంబినేషన్స్ ను కూడా ఎప్పుడూ ఆహ్వానిస్తాడు అక్కినేని నాగార్జున. ఇదివరకే “కృష్ణార్జున” అనే చిత్రంలో మంచు విష్ణుతో కలిసి నటించిన నాగార్జున అంతకుమునుపు “అధిపతి” చిత్రంలో మోహన్ బాబుతోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకొన్నారు. ఇటీవలే “ఊపిరి” చిత్రంలో కార్తీతో కలిసి నటించి నటుడిగా తన స్థాయిని తమిళ ప్రేక్షకులకు పరిచయం చేశారు. తెలుగులో ప్రస్తుతం నానితో కలిసి నటించేందుకు రెడీ అవుతున్న నాగార్జున ఇప్పుడు మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

పివిపి సంస్థ నిర్మాణ సారధ్యంలో ధనుష్ తెలుగులో ఒక స్ట్రయిట్ సినిమా చేయనున్నాడు. ఇటీవలే స్టోరీ డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా దర్శకుడు ఎవరనేది ఫిక్స్ అవ్వనప్పటికీ.. ఈ చిత్రంలో నాగార్జున కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్ర ఏమిటనే విషయంలో ప్రస్తుతం క్లారిటీ లేదు కానీ.. నాగార్జున ఈ సినిమాలో నటించడం మాత్రం పక్కా. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇకపోతే.. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాతో బిజీగా ఉన్న ధనుష్ ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి ఈ సినిమా షూటింగ్ ను మొదలెట్టానున్నాడని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus