కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్

నటుడిగా, నిర్మాతగా.. గేయ రచయితగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. ఇటీవల దర్శకుడిగాను మారిన ధనుష్ ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ లాభాలతోపాటు ప్రేక్షకుల మెప్పుని, విమర్శకుల ప్రశంసలని పొందుతున్నాడు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘విశారణై’ ఇటీవల ఆస్కార్ కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరో కోలీవుడ్ లోని మరో స్టార్ హీరో అయిన విజయ్ తో ఓ సినిమాని నిర్మించనున్నారట.

విజయ్ హీరోగా ధనుష్ అన్న దర్శకుడు అయిన సెల్వ రాఘవన్ ఓ సినిమా చేయనున్నట్టు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమాని నిర్మించనున్నాడు ధనుష్ అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అనతికాలంలోనే ఈ వార్త అంతటా అందుకోవడంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో రానున్న సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం ధనుష్ దర్శకుడిగా పవర్ పాండి సినిమాతో పాటు, నటుడిగా గౌతమ్ మీనన్, వెట్రిమారన్ లతో రెండు సినిమాలు చేయాల్సి ఉంది. అటు విజయ్ సైతం తుది దశకు చేరుకున్న భైరవ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇక సెల్వ రాఘవన్ గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఓ సినిమా పనుల్లో తలమునకలై ఉన్నారు. దీని తర్వాత హీరోగా మారిన హాస్య నటుడు సంతానంతో ఓ సినిమా ప్రకటించారు. వీరంతా తమ తమ సినిమాలు పూర్తి చేశాకే ఈ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళతారట. అంటే.. ఇంకో సంవత్సరం మాట!

https://www.youtube.com/watch?v=FdD8KphmvR8

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus