నాగార్జున, ధనుష్ ల మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు!

సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు ధనుష్ తో టాలీవుడ్ కింగ్ నాగార్జున స్క్రీన్ చేసుకోబోతున్నారా? .. వీరిద్దరి కలయికలో మల్టీ స్టారర్ మూవీ రాబోతోందా? అంటే.. టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. నాగార్జున గతంలో తమిళ యువ హీరో కార్తీతో ఊపిరి అనే మల్టీ స్టారర్ మూవీ చేశారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించింది. అందుకే అప్పటి నుంచి మల్టీ స్టారర్ మూవీపై నాగ్ మరింత నమ్మకాన్ని పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు నాని తో కలిసి “దేవదాస్” అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్నారు. భలే మంచి రోజు చిత్ర దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈనెలలో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 27న చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

ఇదే కాకుండా హిందీ లోను మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ , రణబీర్ కపూర్ లతో కలిసి “బ్రహ్మస్త్ర” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల సినిమా ఒకటి కంటే ఎక్కువ భాషల్లో బిజినెస్ జరిగే వీలుంది. అందుకే మరో సారి తమిళ హీరోతో నటించడానికి ఒకే చెప్పారు. ధనుష్ తో కలిసి నాగ్ సినిమా చేయడం ఖరారు అయినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి . అయితే ధనుష్ నిర్మాతగా నాగ్ హీరోగా తెరకెక్కనుందా?, ధనుష్ దర్శకత్వంలో నాగ్ ద్విభాషా చిత్రాన్ని చేయనున్నారా? ఇద్దరు కలిసి నటిస్తున్నారా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus