Dhanush: ఆ విషయంలో మాత్రం ధనుష్ రియల్లీ గ్రేట్!

స్టార్ హీరోల ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో స్టార్ హీరోల సినిమాలలో ఒక సినిమా ఫ్లాప్ అయినా హీరోల కెరీర్ పై ఊహించని స్థాయిలో పడుతుంది. స్టార్ హీరో ధనుష్ కు కోలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా పాపులారిటీ ఉంది. పాన్ ఇండియా హీరోగా ధనుష్ తన క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచుకోవడం గమనార్హం. ధనుష్ తన సినీ కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలలో నటించారు.

Click Here To Watch Now

సాధారణంగా చాలా సినిమాలకు షూటింగ్ సమయంలోనే హీరోలకు, దర్శకనిర్మాతలకు సినిమా ఫలితంపై అంచనా ఏర్పడుతుంది. సినిమా అంచనాలకు అనుగుణంగా లేని పక్షంలో రీషూట్ లు జరిపి సినిమాను రిలీజ్ చేయడానికి హీరోలు, దర్శకులు ప్రాధాన్యత ఇస్తారు. రీషూట్ చేసినా ఫలితం ఉండదని భావిస్తే మాత్రం నష్టానికి సిద్ధమై సినిమాను నిర్మాతలు థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఓటీటీల హవా పెరగడంతో సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఆ సినిమా హక్కులను ఓటీటీకి ఇవ్వడం మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాని నటించిన వి, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ సినిమాలు థియేటర్లలో విడుదలై ఉంటే మాత్రం నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలు వచ్చేవని కామెంట్లు వినిపించాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన జగమే తంత్రం ఓటీటీలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. ధనుష్ నటించిన మరో సినిమా మారన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది.

ఓటీటీలో విడుదల కాకపోయి ఉంటే ఈ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. తన ఫ్లాప్ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తూ నిర్మాతలకు నష్టం రాకుండగా ధనుష్ జాగ్రత్త పడ్డాడని నెటిజన్లు ధనుష్ ను ప్రశంసిస్తున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోలు, రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ లేని హీరోలు ఓటీటీలపై ఆధారపడితే మంచిదని చెప్పవచ్చు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus