కోలీవుడ్‌లో మరో స్టార్ కిడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా? అంటే దాదాపు అవును అనే ఆన్సర్ వస్తోంది. అయితే ఆ స్టార్ కిడ్కి ఒకటి కాదు ఏకంగా రెండు సినీ వారసత్వాలు ఉండటం గమనార్హం. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు, నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు పుకార్లు కూడా రాలేదు. కానీ పుకార్లు మాత్రం తెగ షికారు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రెస్ మీట్ కారణంగానే ఈ పుకార్లు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ ఈవెంట్లో క్లిక్‌మనిపించిన ఓ ఫొటో కారణంగానే అని చెప్పొచ్చు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిని ఐశ్వర్య, ధనుష్‌ల పెద్ద కొడుకు యాత్ర గురించే ఇదంతా. చూడటానికి హీరోలా ఉన్నాడు అంటూ శుక్రవారం రాత్రి నుండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాలో రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ను ఇటీవల నిర్వహించారు. దీనికి ఇద్దరు తనయులతో ఐశ్వర్య వచ్చారు.
ఐశ్వర్య పెద్ద కుమారుడు యాత్ర, రెండో కుమారుడు లింగ… ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. యాత్ర అచ్చు గుద్దినట్లు ధనుష్లాగే ఉన్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు కొంతమంది ఓ అడుగు ముందుకేసి యాత్ర త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు. హ్యాండ్సమ్ లుక్స్‌తో అదిరిపోయిన యాత్ర హీరోగా ఎంట్రీ ఇచ్చి… తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలని (Dhanush) ధనుష్ అభిమానులు ఆశపడుతున్నారు.
నిజానికి ధనుష్ కూడా ఈ వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. మరి యాత్ర ఏం చేస్తాడో చూడాలి. ఓవైపు ధనుష్, మరోవైపు రజనీ వారసుడిగా యాత్ర సినిమాల్లోకి వస్తాడు. ఆ రెండు ఇమేజ్‌లను కాపాడుకుంటూ ముందుకెళ్లడం అంత ఈజీ కాదు. మరి ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. తండ్రీ కొడుకులు ఒకేసారి సినిమాల్లో ఉండటం ఫ్యాన్స్‌కి హ్యాపీనే కదా.