బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలలో ఢీడాన్స్ షో కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైతన్య ఆదివారం సాయంత్రం నెల్లూరు క్లబ్ హోటల్లో సూసైడ్ చేసుకొని మరణించిన వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది.
నెల్లూరుకి చెందిన చైతన్య బిటెక్ పూర్తి చేశారు అయితే డాన్స్ పై మక్కువతో ఈయన ఈ రంగం వైపు అడుగులు వేశారు. ఢీడాన్స్ షో ద్వారా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైతన్య ఇలా ఆత్మహత్యకు పాల్పడటం అందరిని ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. అయితే ఈయన చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోని రికార్డు చేసి తన చావుకు గల కారణాలను కూడా తెలియజేశారు.
తను అప్పులు చేయటం వల్లే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. అప్పు ఇచ్చినవారు ఎక్కువ ఒత్తిడి చేయటంతో ఆ ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలియజేశారు.ఒక అప్పు తీర్చడం కోసం మరొకచోట అప్పు చేస్తూ అప్పుల భారీగా పెరిగిపోయాయని అయితే ఈ అప్పుల నుంచి బయటపడటం తన వల్ల కాలేదని, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు తన తల్లిదండ్రులు ఇతర డాన్సర్లు తనను క్షమించాలని క్షమాపణలు కోరాడు.
ఇక తనకు కొరియోగ్రాఫర్ గా ఢీడాన్స్ షో ఎంతో మంచి పేరు తెచ్చింది తాను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అయితే ఈ కార్యక్రమంలో సంపాదన మాత్రం పెద్దగా లేదని రెమ్యూనరేషన్ తక్కువగా ఇచ్చేవారని, అదే జబర్దస్త్ లో భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటూ వెల్లడించారు.ఇలా ఈయన ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలియడంతో పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేసి తన బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.