బిగ్‌బాస్‌ 4: హారికలో ఉన్న ప్లస్ పాయింట్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో బేబీ డే కేర్ సెంటర్ టాస్క్ అనేది చాలా రసవత్తరంగా ముగిసింది. ముఖ్యంగా హెడ్ మిసెస్ అయిన లాస్య చాక్లెట్స్ ఇచ్చేటపుడు హారిక తనని బాగా ఇంప్రెస్ చేసింది. దాగుడుమూతలు ఆడుకుంటున్న పిల్లల్లో హారిక చాలా యాక్టీవ్ గా పెర్ఫామ్ చెయడంతో చాక్లెట్స్ గెలుచుకుంది. ఇక్కడే చాలా తెలివిగా మాస్టర్ పాకెట్ లోనుంచి చాక్లెట్ ని కొట్టేసింది హారిక. అయితే, చాలాసేపు మాస్టర్ మళ్లీ తిరిగి కొట్టేసేందుకు ట్రై చేశారు. కానీ హారిక ఎక్కడా కూడా మాస్టర్ కి చాక్లెట్ ని చిక్కనివ్వలేదు. చాలాసేపు పోరాడింది. దీంతో మాస్టర్ బాగా ప్రస్టేట్ అయిపోయారు. హారికపై అలిగి వెళ్లి టాస్క్ ఆడను అనడంతో అక్కడ చాలాసేపు టాస్క్ ఆగిపోయింది. అంతేకాదు, హౌస్ మేట్స్ అందరూ మరోసారి టాస్క్ పేపర్ ని చదువుకుని లాజిక్స్ వర్కౌట్ చేశారు.

నిజానికి లాస్య హారికకి చాక్లెట్ ఇవ్వగానే వెంటనే అవినాష్ లాక్కోవడానికి ట్రై చేశాడు. అక్కడ తన చాక్లెట్ ని చాలా బాగా ప్రొటక్ట్ చేస్కుంది హారిక. ఆ తర్వాత స్కూల్ బెంచ్ పైన కూడా అరియానా అవినాష్ హారికలు దీనికోసం కాసేపు కొట్టుకున్నారు. అక్కడ కూడా చాక్లెట్స్ చిక్కనివ్వలేదు హారిక. మొత్తానికి చాక్లెట్స్ అన్నింటిని బాగా ప్రొటక్ట్ చేస్కుంది. అయితే, ఎప్పుడైతే గేమ్ ఆగిపోయిందో.., గేమ్ ముందుకు వెళ్లాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో మాస్టర్ కి తిరిగి చాక్లెట్ ఇచ్చి తన క్రీడాస్ఫూర్తిని చాటుకుంది. చాక్లెట్ బేబీ గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు, రాత్రి మనం అబ్జర్వ్ చేసినట్లయితే తన చాక్లెట్స్ ని భద్రంగా ఒక చోట దాచుకుంది , అలాగే లాస్య దగ్గర ఉన్న చాక్లెట్స్ ని కొట్టేసింది కూడా. కానీ, తర్వాత అవి కౌంట్ అవ్వవు అని తెలిసి తిరిగి ఇచ్చేసింది.

ఇక్కడే తను గేమ్ లో ఎంత సీరియస్ గా ఉంటానో, అంతే సిన్సియర్ గా ఉంటాను అని నిరూపించుకుంది హారిక. ఇప్పుడు హారిక నిన్న ఆడిన టాస్క్ కి నెటిజన్స్ నువ్వు కేక అంతే అనే కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క టాస్క్ మాత్రమే కాదు, గతంలో కూడా టాస్క్ లో లాజిక్ ని పట్టుకుని మరీ ఆడటంలో హారిక రాటుదేలిపోయింది. ఈ టాస్క్ లో హారికకి వస్తున్న పాజిటివిటీ ఖచ్చితంగా తనని టాప్ 5 లోకి తీసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus