ఎన్ని రోజులు ఆడింది కాదన్నయ్యా.. ఎంత కలక్షన్ వసూల్ చేసింది. అనేదే ముఖ్యం!.. ప్రస్తుతం సినిమా విజయ కొలమానమిది. అందుకే చిత్రం రాబట్టిన మొత్తంలో తొలి రోజు కలక్షన్ కీలకం అవుతోంది. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఎక్కువ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేసి కోట్లను కొల్లగొడుతుంటారు. ఇప్పటి వరకు ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలుగా వరుసగా బాహుబలి (23 కోట్లు ), సర్దార్ గబ్బర్ సింగ్ (20 .91 కోట్లు ), జనతాగ్యారేజ్ (20 . 80 కోట్లు) ఉన్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలయిన మెగా పవర్ స్టార్ మూవీ ధృవ ఈ రికార్డులను తిరగరాస్తుందని అనుకున్నారు.
కానీ ఈ చిత్రం తొలిరోజు 10 .5 కోట్లు రాబట్టేందుకు కష్టాలు పడింది. 20 కోట్ల మార్కుని దాటేందుకు మూడు రోజులు పట్టింది. సోమవారానికి 25 కోట్లను వసూలు చేసింది. యంగ్ టైగర్ చిత్రానికి ధృవ దరిదాపుల్లో కూడా నిలవలేదు. చెర్రీ సినిమా హిట్ టాక్ తెచుకున్నప్పటికీ వసూల్ పరంగా వీక్ గా ఉండడానికి పెద్ద నోట్ల రద్దే కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. నోట్ల కోసం బ్యాంకుల ముందు బారులు తీసురుతున్న ఈ సమయంలో 25 కోట్లను వసూల్ చేయడం సామాన్యమైన విషయం కాదని వారు వెల్లడించారు. ధృవ లాంగ్ రన్లో జనతా గ్యారేజ్ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.