క్లాసీ ఆల్బమ్ ‘ధృవ’

సూపర్ హిట్ కొట్టాలని కసితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎంతో కష్టపడి చేసిన మూవీ ‘ధృవ’. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. డిసెంబర్ 2న విడుదలకానున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా స్వరాలను అందించారు. ఈ ఆడియోని మంగళవారం రాత్రి విడుదల చేశారు. ఈ పాటలు ఎలా ఉన్నాయంటే..

ధృవ ధృవసినిమాకి టైటిల్ సాంగ్ ధృవ ధృవ. ఇందులో సమాజంలో జరుగుతున్న చెడుకు వ్యతిరేకంగా హీరో నిలబడ్డాడు అనే అర్ధం వచ్చే విధంగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. విభిన్నమైన బీట్ లో అమిత్ మిశ్రా గానం మిక్స్ అయి హుషారుని తెస్తోంది. ఈ పాటకు కోరస్ ప్రత్యేక ఆకర్షణ.

చూసా చూసాయువత మనసును మీటే రొమాంటిక్ సాంగ్ “చూసా చూసా”. పద్మలత గానం ఈ పాట కు కొత్త ఫ్లేవర్ అద్దింది. మధ్యలో తమీజా ఇచ్చిన ర్యాప్ టచ్ సూపర్. చంద్ర బోస్ సాహిత్యం హాయిగా అనిపిస్తుంది.

పరేషానురాప్యారులో పడిపోతే పరేషానురా.. అంటూ మొదలయ్యే ఈ పాట విన్న అందరిని తన ప్రేమలో పడేస్తోంది. గాయని పద్మ లత, మరో సింగర్ విష్ణు ప్రియ తో కలిసి ఆలపించిన ఈ సాంగ్ ధృవ ఆల్బంలో ఎక్కువ మార్కులు కొట్టేసింది. ‘గొడవలు మోసే గుండె నిండా అరుపులురా.. కేకలురా’ లాంటి రచయిత యాదగిరి ప్రయోగాలు అద్భుతహా అనిపిస్తున్నాయి.

నీతోనే డ్యాన్స్మెగా అభిమానుల హార్ట్ బీట్ ని పెంచిన పాట ‘నీతోనే డ్యాన్స్ టు నైట్..’. తొలి మూడు పాటలను కూల్ గా
టేకాఫ్ చేసి నాలుగో పాటలో తన ఫాస్ట్ బీట్ రుచి చూపించారు తమీజా. ఈ పాటను గాయని నిఖితతో కలిసి అతనే పాడారు. చంద్రబోస్ అందించిన లైన్లు అందరూ హమ్ చేసుకునే విధంగా ఉన్నాయి.

ధృవ చిత్ర పాటలను వింటుంటే … తెలుగు సినిమా లో ఆరు పాటలుండాలి. అందులో ఒకటి ఐటెం సాంగ్ ఉండాలి. మాస్ కి రెండు పాటలు, క్లాస్ కి రెండు పాటలు అని లెక్కలేసుకొని పాటలను కంపోజ్ చేసినట్లుగా లేదు. ధృవ సబ్జెక్ట్ కి తగినట్లుగా సాంగ్స్ ని తమీజా కంపోజ్ చేసినట్లు ఉంది. స్టోరీ బాక్స్ నుంచి బయటికి రాలేదనిపిస్తోంది. రామ్ చరణ్ ఇది వరకు సినిమాల లాగా మాస్ లో ఈ ఆల్బమ్ ఇప్పుడు వేగంగా దూసుకుపోకపోయినా, తెరపైన చూసినప్పుడు మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus