Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్ : ది రివేంజ్'(Dhurandhar: The Revenge) అదే ‘దురంధర్ 2’ చిత్రం మార్చి 19న రిలీజ్ అయ్యింది. డిసెంబర్లో రిలీజ్ అయిన ‘దురంధర్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Dhurandhar: The Revenge Collections

అందువల్ల మొదటి నుండి ‘దురంధర్ 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే ప్రీమియర్ షోల నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ టాక్ చెప్పారు. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోటీగా రిలీజ్ అయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘దురంధర్ 2’ భారీ వసూళ్ళు సాధిస్తోంది. ఇక తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రావడంతో వసూళ్ళు ఇంకా పెరుగుతున్నాయి అని చెప్పాలి.మొదటి వారం ఈ సినిమా మంచి వసూళ్ళు సాధించింది. ఒకసారి ‘దురంధర్ 2’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

ఏపీ+తెలంగాణ 59.7 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ 572 cr
ఓవర్సీస్  295 cr
వరల్డ్ టోటల్ 926.7 cr (గ్రాస్)

 ‘దురంధర్ : ది రివేంజ్'(దురంధర్ 2) మొదటి వారం పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.926.7 కోట్ల(గ్రాస్) ని కలెక్ట్ చేసింది. మొదటి వారం అత్యధిక వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది ‘దురంధర్’. కేవలం ఇండియాలోనే రూ.631.7 కోట్ల వరకు వసూల్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.59.7 కోట్లు(తెలుగు+ హిందీ(వెర్షన్లు కలుపుకుని)) గ్రాస్ ను కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. 2వ వీకెండ్ కూడా ఈ సినిమా భారీగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.

అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus