సుకుమార్ సినిమా క్యాన్సిల్ చేసి మహేష్ తప్పు చేశాడా?

సుకుమార్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయనతో సినిమా చేయడం లేదు, ఆయన తదుపరి చిత్రానికి ఆల్ ది బెస్ట్ అని మహేష్ చాలా స్పోర్టివ్ గా మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చిన స్టేట్ మెంట్ ని అందరూ మెచ్చుకున్న విషయం తెలిసిందే. పొగిడినవాళ్లు ఎందరున్నారో తెలియదు కానీ… మహేష్ నిర్ణయానికి బాధపడిన, తిట్టినవాళ్లే ఎక్కువ అని చెప్పొచ్చు. సుకుమార్ దర్శకత్వంలో సుకుమార్ సినిమా అనగానే మహేష్ అభిమానులందరూ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా.. “ఒన్ నేనొక్కడినే” తరహా క్లాసిక్ ని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ మహేష్ స్టేట్ మెంట్ తో అందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ముఖ్యంగా.. సుకుమార్ సినిమా క్యాన్సిల్ చేసి అనిల్ రావిపూడితో సినిమా కన్ఫర్మ్ చేయడాన్ని వారు దిగమింగుకోలేకపోతున్నారు. అనిల్ రావిపూడి కెరీర్ లో ఫ్లాప్స్ లేకపోయినప్పటికీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే స్థాయి హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ముఖ్యంగా.. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన “ఎఫ్ 2” కూడా పోటీగా మరో సినిమా లేకపోవడం వల్ల హిట్ కొట్టిన సినిమానే కానీ… పొరపాటున గట్టి పోటీ వచ్చి ఉంటే ఆ సినిమాకి అంత సీన్ లేదనే విషయం అందరికీ తెలిసిందే. మరి మహేష్ ఏమనుకున్నాడో ఏమో కానీ ఈ సినిమా కన్ఫర్మ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. మరి మహేష్ మనసులో ఏముంది? సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ చేసి తప్పు చేశాడా? అని అందరూ గొణుక్కుంటున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus