“సుప్రీమ్”కు లాభాలొచ్చాయా???

సినిమా బావుంటే ఎవరైనా, ఏ సీజన్ లో అయినా చూస్తారు. కానీ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా, సినిమా సూపర్ హిట్ అయ్యండి అంటే మాత్రం అది అయితే సినిమాలు ఏమీ లేని సమయంలో విడుదల కావాలి, లేదంటే సుమ్మర్ స్పెషల్ గా అయినా రావాలి. ఇప్పుడు మెగా శిబిరం నుంచి వచ్చిన హీరోలకు అదే జరిగింది….విషయం ఏమిటంటే…సుమ్మర్ సీజన్ లో విడుదలయిన రెండు మెగా హీరోల సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చింది. అయితే ఆ రెండు సినిమాలు భారీ హిట్ గా దూసుకుపోతున్నాయి…వివరాల్లోకి వెళితే…

‘సరైనోడు’ లాంటి డివైడ్ టాక్ వచ్చిన సినిమా ఏ రేంజికి వెళ్లిందో చూస్తూనే ఉన్నాం. ఇక  ఇప్పుడిక ‘సుప్రీమ్’ వంతు వచ్చింది. ఈ సినిమాకు ఫర్స్ట్ షో నుంచి యావరేజ్ టాక్ వచ్చింది…. మెజారిటీ ఆడియన్స్ ఏవరేజ్ అన్నారు. ఫస్టాఫ్ బావున్నా.. ద్వితీయార్ధం విషయంలో పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే సుమ్మర్ పుణ్యమా అని కలెక్షన్స్ కు మాత్రం డోకా లేకుండా పోయింది…ఓవరాల్గా ‘సుప్రీమ్’ సినిమా యావరేజ్ అని తెలీనా. ఓవైపు ‘సరైనోడు’ దూసుకుపోతున్నా.. పోటీగా విడుదలైన సూర్య సినిమా ‘24’కు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చినా….వీటన్నింటి మధ్యలో ‘సుప్రీమ్’ బండి మాత్రం ఎక్కడా ఆగకుండా….అంచనాలకు భిన్నంగా ‘సుప్రీమ్’ భారీ కలెక్షన్లే సాధిస్తోంది.

వీక్ డేస్ లో వీక్ అయినా.. రెండో వీకెండ్ వచ్చేసరికి ‘సుప్రీమ్’ పుంజుకుంది. అలా తొలి వారంలో రూ.13-14 కోట్ల మధ్య షేర్ సాధించిన ‘సుప్రీమ్’ రెండో వీకెండ్లో ఇంకో రూ.3-4 కోట్లయినా షేర్ తెస్తుందని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్లో రూ.19-20 కోట్ల దాకా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ఈ దెబ్బతో మన సాయి ధర్మ తేజ…టాప్ హీరో అయిపోతాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus