RRR Making Video: ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియోతో రాజమౌళి ఏం చెప్పాడు?

  • July 15, 2021 / 02:44 PM IST

‘బాహుబలి’… ఓ యజ్ఞం. భారతీయ సినిమా పరిశ్రమలో ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా. అది వసూళ్ల  పరంగా కావచ్చు. విజయానికి ప్రామాణికంగా చూసే దృష్టి కోణంలో కావచ్చు. ‘బాహుబలి’ని విమర్శించిన వాళ్ళున్నారు. అయితే, ప్రశంసించినవాళ్ళు ఎక్కువ. లేకపోతే రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చి ఉండేవి కాదు కదా. ప్రేక్షకులకు నచ్చిన, ప్రేక్షకుల మెచ్చిన సినిమా ‘బాహుబలి’. ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో విడుదలైన తర్వాత ‘బాహుబలి’ గురించి ఎందుకు అంత చెప్పాల్సి వస్తుంది? ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ తర్వాత, ఆ సినిమా దర్శకుడి నుండి మరొక సినిమా వస్తుందంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోవడం, ‘బాహుబలి’కి ‘ఆర్ఆర్ఆర్’ ఏమాత్రం తీసిపోదని చెప్పడం రాజమౌళికి అవసరం. అందుకని, సినిమా నుండి విడుదల చేసే పోస్టర్ నుండి పది సెకన్ల టీజర్ వరకూ, ప్రతిదీ ఇంపార్టెంటే. అటువంటిది దగ్గర దగ్గర రెండు నిమిషాల నిడివి గల మేకింగ్ వీడియో విడుదల చేశారు రాజమౌళి. అందులో ఏం చెప్పారు? ఆయన చెప్పిన విషయాల్లో గమనించాల్సినవి ఏంటి?

‘బాహుబలి’కి మించి…


రాజులు, యుద్ధాలు, రాజవంశంలో అంతర్గత కలహాల నేపథ్యంలో ‘బాహుబలి’ తీశారు. రాజు నివసించే భవనం దగ్గర నుండి, రాజ్యం వరకు ఎలాగైనా చూపించవచ్చు. ఊహకు హద్దులు లేవు. ‘ఆర్ఆర్ఆర్’కు వస్తే? ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ స్వాతంత్ర్యానికి ముందు జరిగిన నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ప్రీ – ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఇప్పటికి చాలా వచ్చాయి. మరి, రాజమౌళి కొత్తగా ఏం చూపిస్తాడు? అనే ప్రశ్నకు మేకింగ్ వీడియో ఒక ఆన్సర్ ఇచ్చింది. ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపొని రీతిలో గ్రాండియర్ సెట్స్ వేశామని, హాలీవుడ్ స్థాయిలో తీశామని చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఆ ప్రయత్నం కనిపించింది.

స్టార్స్ అండ్ ఎమోషన్!


ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అలీసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ లుక్స్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఎన్టీఆర్, చరణ్ క్యారెక్టర్ టీజర్లు విడుదల చేశారు. మరి, మేకింగ్ వీడియోలో చూపించినది ఏంటి? స్టార్స్ అండ్ ఎమోషన్. స్టార్స్ అందరూ కొద్దీ సెకన్ల పాటు కనిపించవచ్చు. కానీ, జస్ట్ లుక్స్ చూపించడం కోసం వాళ్ళను టీజర్లో చూపించలేదు రాజమౌళి. వాళ్ళ క్యారెక్టర్స్ తాలూకా ఎమోషన్స్ చూపించాడు. ఖాకీ లుక్ లో చరణ్ స్టయిలిష్ గా ఉన్నాడు. ఎన్టీఆర్ ఎమోషనల్ గ కనిపించాడు. శ్రియ, సముద్రఖనిలను తొలిసారి రాజమౌళి మేకింగ్ వీడియో లో చూపించారు. వాళ్ళ లుక్స్ రివీల్ చేశాడన్నమాట.

భారీ సాంగ్ కన్ఫర్మ్!


‘ఆర్ఆర్ఆర్’లో భారీ సాంగ్ ఒకటి ఉంది. ఒక్క పాట కోసం నెల రోజులు షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. ఎన్ని రోజులు తీశారు? సాంగ్ ఎలా ఉండబోతుంది? అనేది పక్కనపెడితే… పాటకు సంబంధించి చిన్న విజువల్ మేకింగ్ వీడియోలో చూపించారు.

రాజమౌళి స్టాంప్ ఏమైంది?


‘an s.s. rajamouli film’ – ప్రతి సినిమాకు రాజమౌళి వేసుకునే స్టాంప్. ‘ఆర్ఆర్ఆర్’లో  అజయ్ దేవగణ్ క్యారెక్టర్ మోషన్ పోస్టర్ వరకూ ‘an s.s. rajamouli film’ అని వేసుకున్నారు. కానీ, ఈసారి స్టాంప్ మారింది. ‘the master storyteller and his team’ అని రాజమౌళి వేసుకున్నారు. ‘బాహుబలి’ తర్వాత మళ్ళీ టీమ్ అంతా కలిసి చేస్తున్న సినిమా అని చెప్పారు. ప్రపంచ ప్రేక్షకులకు ‘బాహుబలి’ని మరోసారి గుర్తు చేయడం అన్నమాట. మేకింగ్ వీడియోలో స్టోరీ డిస్కషన్స్ లో రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్, సోదరుడు కాంచి సహా దర్శకుడు త్రికోటిని చూడవచ్చు. ‘దిక్కులు చూడకు రామయ్య’తో దర్శకుడిగా మారిన త్రికోటి, ఆ సినిమాకు ముందు రాజమౌళి దగ్గర కో-డైరెక్టర్ గా పని చేశారు. మళ్ళీ ఈ సినిమాకు రాజమౌళి దగ్గర పని చేశారు. టెక్నీషియన్లు అందరికీ వీడియోలో చోటు కల్పించాడు రాజమౌళి.

నాట్ బట్ నాట్ లీస్ట్!


నో డౌట్… సాబు సిరిల్ టాప్ ప్రొడక్షన్ డిజైనర్. ‘బాహుబలి’ సెట్స్ చూస్తే ఆయన వర్క్ తెలుస్తుంది. ఈ సినిమాకూ ఆయన పని చేశారు. అయితే, మేకింగ్ వీడియోలో ఆయన పెయింటింగ్ వేస్తున్న షాట్ ఎంత మంది గమనించారు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus