‘సరిలేరు నీకెవ్వరు’ కి ఇది పెద్ద దెబ్బే..!

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక మ్యూజిక్ విషయంలో మహేష్ గత చిత్రం ‘మహర్షి’ కి ఆశించిన స్థాయిలో దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్లు ఇవ్వలేకపోయాడన్న కామెంట్స్ వినిపించాయి. అయినప్పటికీ ఈసారి మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆల్బుమ్ ఇస్తానని దేవి శ్రీ.. ప్రామిస్ కూడా చేసాడు. అయితే ఈసారి కూడా దేవి శ్రీ సరైన ట్యూన్లు ఇవ్వట్లేదు అని అనిల్ రావిపూడి దేవి శ్రీ ఒత్తిడి చేస్తున్నాడట.

దీంతో వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని తెలుస్తుంది. ఆర్మీ సాంగ్ కచ్చితంగా ఎఫక్టివ్ గా ఉండాలని అనిల్ రావిపూడి చెబుతుంటే.. దేవి శ్రీ మాత్రం పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అనిల్ రావిపూడి అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తుంది. అయితే ‘ఎఫ్2’ చిత్రానికి దేవిశ్రీతో మంచి మ్యూజిక్ చేయించుకున్న అనిల్ ఇప్పుడు చాలా తడబడుతున్నాడు. ఇక మహేష్ అయితే గుడ్డిగా.. ‘దేవి శ్రీ మంచి మ్యూజిక్ ఇస్తాడనే’ నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఏమి జరుగుతుందో చూడాలి..!

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus