ఈ నెలలో పోటీపడనున్న సినిమాలు!

తెలుగు చిత్ర పరిశ్రమ ఫుల్ జోష్ లో ఉంది. పండుగలు, సీజన్ లతో సంబంధం లేకుండా ప్రతి వారం సినిమాలు సందడి చేస్తున్నాయి. దసరాకి కూడా జై లవకుశ, స్పైడర్, మహానుభావుడు చిత్రాలు రిలీజ్ అయి వినోదాన్ని అందిస్తున్నాయి. దీపావళికి కూడా సినిమాల హంగామా ఉండనుంది. ఈ నెలలో అక్కినేని నాగార్జున నటించిన “రాజుగారి గది-2 “, మాస్ మహారాజ రవితేజ “రాజా ది గ్రేట్”, గోపీచంద్ “ఆక్సిజన్”, ఎనర్జిటిక్ హీరో రామ్ “ఉన్నది ఒక్కటే జిందగీ” .. మరికొన్ని సినిమాలు రిలీజ్ కి ముస్తాబు అవుతున్నాయి. ఈ పండుగ విజయాన్ని అందించాలని నాగార్జున, రవితేజ, రామ్, గోపిచంద్ లు గట్టిగా కోరుకుంటున్నారు.

ఎందుకంటే  నాగార్జున గత చిత్రాలు నిర్మలా కాన్వెంట్, నమో వెంకటేశాయ హిట్ ఇవ్వలేకపోయాయి. సో అక్టోబర్ 13న రిలీజ్ కానున్న రాజుగారి గది-2 పై ఆశలు పెట్టుకున్నారు. అలాగే రవితేజకి ‘బెంగాల్ టైగర్’ నిరాశని మిగిల్చింది. ఈ నెల 12న రానున్న ‘రాజా ది గ్రేట్’  అయిన ఉత్సాహం ఇస్తుందని చూస్తున్నారు.   ఇక వరుసగా మూడు ఫ్లాఫ్స్ అందుకున్న  గోపీచంద్ కూడా  ‘ఆక్సిజన్’ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇది  ఈ నెలాఖరు 27న థియేటర్లోకి రానుంది. రామ్ కూడా అదే రోజు “ఉన్నది ఒక్కటే జిందగీ” తో వస్తున్నారు. మరి అక్టోబర్ మాసం ఎవరికి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus