శ్రీనివాస కళ్యాణంపై నమ్మకంగా ఉన్న దిల్ రాజు!

తండ్రి పిల్లల మధ్య  అనుబంధం ఎలా ఉండాలో.. శతమానం భవతి సినిమాలో చక్కగా చూపించి.. దర్శకుడు సతీష్ వేగ్నేశ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సారి శ్రీనివాస కళ్యాణంలో మన పెళ్లి తంతులో ఉన్న సున్నితమైన అంశాలపై ఆలోచింపజేయించనున్నారు. ఈ కథలో నితిన్, రాశీఖన్నాపెళ్లిపీటలపై కూర్చోనున్నారు. ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప్రీ రిలీజ్ వేడుకలో ఆర్టిస్టులు మాట్లాడిన విధానం చూస్తుంటే సినిమా బాగా వచ్చినట్లు అనిపిస్తోంది.

ఇక దిల్ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమా చూసిన వారికి తమ ఇంట్లో కూడా ఏదో పెళ్లి జరుగుతోందన్న ఫీలింగ్  కలుగుతుంది. యుగాలలో త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అంటూ ఎన్ని మార్పులు జరిగినా దేవుడే స్వయంగా మనిషి అవతారం ఎత్తినా పెళ్లికున్న గొప్పదనం మాత్రం తగ్గలేదని, దానికి ఉదాహరణగా ఇప్పటికీ సంప్రదాయాలను పాటించడమే” అని చెప్పారు. “నితిన్, రాశి ఖన్నాతో పాటు ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఇందులో నటించిన వాళ్ళందరూ కథని ఓన్ చేసుకున్నారు. అందుకే ఈ సినిమా అంత చక్కగా వచ్చింది” అని దిల్ రాజు వివరించారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఆగస్ట్ 9 న విడుదలకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus