Dil Raju, Anil Ravipudi: రావిపూడిని రాజుగారు వదిలేలా లేరు.. చిరు తరువాత మరో రెండు?

సంక్రాంతి పండుగకు రిలీజైన “సంక్రాంతికి వస్తున్నాం”  (Sankranthiki Vasthunam) సినిమా అనిల్ రావిపూడి (Anil Ravipudi) కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. కామెడీ, క్రైమ్ర్ డ్రామా కథతో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ విజయం దిల్ రాజు (Dil Raju)  కాంపౌండ్‌లో చాలా కాలం తర్వాత వచ్చిన హిట్‌గా నిలవడం గమనార్హం. ఫ్లాప్స్‌తో కుదేలైన దిల్ రాజుకి అనిల్ రావిపూడి మరోసారి తన సక్సెస్ ఫార్ములాతో అండగా నిలిచాడు.

Dil Raju, Anil Ravipudi:

Dil Raju and Anil Ravipudi Team Up for Two More Projects (1)

ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తీసుకున్న 8 సినిమాల్లో ఎక్కువ శాతం దిల్ రాజు బ్యానర్‌లోనే వచ్చినా, అవి అన్నీ హిట్ ఫార్ములాతో ఘనవిజయం సాధించాయి. ఈ సినిమా విజయంతో నిర్మాత దిల్ రాజు అనిల్ రావిపూడితో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, “సంక్రాంతికి వస్తున్నాం” తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో  (Chiranjeevi) భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక దిల్ రాజు అనిల్ రావిపూడితో మరిన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ చిరు సినిమాతో బిజీగా ఉండగా, ఆ తర్వాతి ఏడాదికి దిల్ రాజు ప్రాజెక్ట్స్ షెడ్యూల్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ ఎవరితో ఉంటాయనేది ఆసక్తికర చర్చగా మారింది. అయితే, అనిల్ రావిపూడి రూపొందించే ప్రతి కథలో తనదైన ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేయడంలో నిపుణుడు కావడంతో, ఈ సినిమాలు కూడా ఘన విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి తన సింపుల్ కథలతో ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చిరంజీవితో పాటు దిల్ రాజు (Dil Raju) ప్లాన్ చేసిన సినిమాలు కూడా విజయవంతం అయితే, ఆయన కెరీర్ మరింత ఎత్తుకు చేరే అవకాశం ఉంది. “సంక్రాంతికి వస్తున్నాం” విజయంతో వచ్చిన ఈ జోరు ఇప్పుడు చిరు సినిమాలో కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.

పుష్ప 2 మాయలో దేవర 2.. క్లిక్కయ్యేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus