యువహీరోలపై దిల్ రాజు క్లారిటీ!!!

టాలీవుడ్ లో సహజంగా వినిపించే “ఆనలుగురు” అన్న పధంలో ఒకరైన నిర్మాత దిల్ రాజు ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. ఒకానొక సమయంలో అంతా అయిపోయింది వెళ్లిపోవాలి అని సైతం అనుకుని అదృష్టం తలుపు తట్టి, అతని శ్రమ, కలసివచ్చి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా నిలిచిపోయాడు. ఇదిలా ఉంటే ఒకప్పుడు దిల్ రాజు నిర్మాణం నుంచి సినిమా వస్తుంది అంటే హీరోతో సంభంధం లేకుండా ప్రేక్షకులు సినిమాకు వచ్చేవారు.

మరి ఇప్పుడు ఏమయ్యిందో ఏమో కానీ, ఈ నిర్మాతగారు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ తుస్సు మనడమే కాకుండా, అసలు మొదలు దగ్గరే నొప్పి మొదలవుతుంది. విషయంలోకి వెళితే…రవితేజతో “ఎవడో ఒకడు” సినిమా చెయ్యాల్సిన దిల్ రాజు ఆయనతో వచ్చిన మనస్పద్దలతో ఆ ప్రాజెక్ట్ వదిలేసాడు. అంతటితో అయిపోకుండా…శతమానం భవతి అనే ప్రాజెక్టును సతీష్ వేగేశ్నతో చేసేందుకు సిద్దం అయ్యి మొదట ఈ సినిమాను సాయి ధర్మ తేజతో చేద్దాం అని అనుకున్నాడు, కానీ అనుకోని విధంగా లీడ్ రోల్ లో రాజ్ తరుణ్ చేయనున్నట్లు సమాచారం వచ్చింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ అగ్రీమెంట్ పై సంతకం కూడా చేసినట్లు సమాచారం. అయితే వీటన్నింటినీ ఖండిస్తూ రాజు ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు, అదేమిటంటే ‘శతమానం భవతి స్టోరీని సాయి ధరం తేజ్ – రాజ్ తరుణ్..ఇద్దరికీ చెప్పాం. ప్రాజెక్టుకు ఇంకా ఎవరూ సైన్ చేయలేదు. ఆగస్టులో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాం. అప్పటికి ఎవరు డేట్స్ ఇస్తే ఎవరు ఖాళీగా ఉంటే వారితో చేస్తాను. నాకు ఆ హీరోలతో ఎలాంటి గొడవలు లేవు అని తేల్చి చెప్పేసాడు. మరి రాజు గారు అంత గట్టిగా చెబుతున్నారు అంటే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది అన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus