సినిమాకు మంచి టాక్ వచ్చి వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అనుకునేలోపు… ఏపీలో టికెట్ తగ్గింపు ధరల అడ్డు తగిలింది. రేట్లు పెంచుకోవడం పక్కనపెడితే… మామూలుగా వసూలు చేసే ధరలు కూడా తగ్గించమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతా బాగున్నా… వసూళ్ల దగ్గర చిన్న లాస్ కనిపిస్తోంది నిర్మాతకి. ఇదంతా ఏ సినిమా గురించో మీకు తెలుసుగా… పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఫిల్మ్ ‘వకీల్ సాబ్’ గురించి. నిర్మాతకు ఉన్న తలనొప్పులు చాలవు అన్నట్లు సినిమా త్వరలో ఓటీటీలో వచ్చేస్తోంది అంటూ పుకార్లు మొదలయ్యాయి. దీంతో ఈ విషయమై నిర్మాత దిల్ రాజు స్పందించారు.
గత రెండు రోజుల నుండి ‘వకీల్‌సాబ్’ చూడటానికి కంగారు పడకండి… త్వరలోనే ఓటీటీలో వచ్చేస్తుంది అంటూ ఒకటి , రెండు డేట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో వెళ్దం అనుకున్నవాళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నారని సమాచారం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ వేదికగా స్పందించింది.‘‘సినిమా ఓటీటీ లో అంటూ వస్తున్న వార్తలు నమ్మకండి. ‘వకీల్‌సాబ్’ని థియేటర్లలోనే చూడండి’’అంటూ ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ. ‘‘ప్రస్తుతానికి ఏ ఓటీటీలోనూ ‘వకీల్‌సాబ్’ను విడుదల చేసే ఆలోచనే లేదు’’ అంటూ మరికొంత క్లారిటీ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లకు రావడానికి ప్రజలు కాస్త ఆలోచిస్తున్నారు. దీంతో సినిమా వసూళ్లు అంతగా లేవని అంటున్నారు. ఈ సమయంలో ఇలా ఓటీటీ పుకార్లు వస్తే ఏ నిర్మాతకైనా లాస్ కదా. అందుకే దిల్ రాజు టీమ్ ఇలా స్పందించింది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లు… చక్కగా మాస్క్ పెట్టుకొని, వీలైతే ఫేస్ షీల్డ్ పెట్టుకొని, తరచుగా చేతులు శానిటైజ్ చేసుకొని సినిమా చూసేయండి. అదీ మీకు ఓకే అనుకుంటేనే.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!