పవన్ కోసం ’50’కోట్లా??

ప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాతగా చాలామణీ అవుతున్న వారిలో దిల్ రాజు ఒకడు. తొలి నాళ్ళలో ఆయన ఎన్నో మంచి సినిమాలు తీసి తన బ్యానర్ ను పతాక స్థాయికి తీసుకొచ్చాడు. అయితే మరో పక్క అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల గాని, లేకపోతే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల అయితే గాని కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మన్నాయి.

సునీల్ హీరోగా తాజాగా వచ్చిన ‘కృష్ణాష్టమి’ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల డిజాస్టర్ అయిన కోటాలోకే వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు, కృష్ణ వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం పేరు ‘రుద్రాక్ష’. ఆ చిత్రానికి దాదాపుగా 40కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించాడు. ఆతరువాత పవన్ కల్యాణ్ తో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడు ఈ బడా నిర్మాత. సహజంగా సినిమాలో హీరో, అతని మార్కెట్ ను అంచనా వేసి సినిమాకు తెరకెక్కించే ఈ నిర్మాత పవన్ ఒప్పుకుంటే 50కోట్లవరకూ బడ్జెట్ పెట్టి మరీ సినిమా తీస్తాను అని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.

ఇక మరో పక్క చిన్న చిన్న సినిమాలే భారీ హిట్స్ అయితే 30కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తున్నాయి. అలాంటిది పవన్ కల్యాణ్ లాంటి హీరోతో 50కోట్లు బడ్జెట్ పెడితే సినిమా యావరేజ్ టాక్ వచ్చినా నిర్మాత సేఫ్ జోన్ లో ఉంటాడు అన్న నమ్మకం ఉంది. అందుకే రాజు పవన్ ఒప్పుకుంటే 50కోట్ల బడ్జెట్ తో సినిమాకు సిద్దం అవుతున్నాడు. చూద్దాం మరి ఈ ఆఫర్ ను పవన్ ఒప్పుకుంటాడో, లేదంటే కాదని తప్పుకుంటాడో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus