తెలుగు సినిమా స్టామినా పెంచుదామని అంటున్న దిల్ రాజు!

ప్రతీ హీరోకి అభిమానులు ఉంటారు…అయితే వారి వారి క్రేజ్ ని బట్టి…ఆ అభిమానుల సంఖ్య భారీగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఏ సినిమా ఇండస్ట్రీలో లేని యాంటీ ఫ్యాన్స్ అనే అంటురోగం మన తెలుగు సినిమాలకు ఉండడం కాస్త ఇబ్బందికర విషయమే…అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యింది అంటే చాలు…సినిమా ఎలా ఉన్నా హిట్ అని అభిమానులు డప్పులు కొడుతూ ఉంటారు…ఫ్లాప్ అని యాంటీ ఫ్యాన్స్ ప్రచారం మొదలు పెట్టేస్తారు. ఇంతకీ ఈ కధ అంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అనేగా మీ డౌట్…అసలు మ్యాటర్ ఏంటి అంటే దిల్ రాజు నిర్మించిన దువ్వాడ జగన్నాధం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కావడం సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం ఇప్పటికే తెల్‌సిందే.. అయితే ఈ సినిమా థ్యాంక్స్ మీట్ లో దిల్ రాజు మాట్లాడిన తీరు చూస్తే యాంటీ ఫ్యాన్స్ సిగ్గుతో తలదించుకోవాలి. ఈ సినిమా గురించి అనే కాదు…అసలు తెలుగు సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ….ఈ సినిమాకు అమెరికా నుండి కాల్ వచ్చింది.. మొదటి సగం బాగుంది.. సెకండ్ హాఫ్ సోసోగా ఉందని హ్యాపీగా పాజిటివ్ రివ్యూ వచ్చిందని రిలాక్స్ అయ్యాను.. ఇక నెల్లూరు కాల్ వస్తే ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది సెకండ్ హాఫ్ బాగుందని అన్నారు. సో ఒక చోట టాక్ మరో చోటా ఇలా సంబంధం లేకుండా ఉంది.

శ్రీరాములు ఈవినింగ్ షో చూశాక ఇక సినిమా హిట్ అని ఫిక్స్ అయ్యామని అన్నారు దిల్ రాజు. సోషల్ మీడియాలో  జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడుతూ….అభిమానులు మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం…ఒక హీరో అభిమాని అని కాదు బాహుబలి తర్వాత డిజె అందుకున్న విజయం గురించి బాంబే నుండి పాజిటివ్ ట్వీట్స్ వచ్చాయి. డిజె సినిమా చూసి హింది సినిమాలు ఇలా తీయరని ట్వీట్స్ వచ్చాయి. అది తెలుగు సినిమా స్టామినా.. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు.. ఏ హీరో అభిమాని మరో హీరోని కించ పరచొద్దు అందరం కలిసి తెలుగు వాళ్లం తెలుగు సినిమా స్టామినా పెంచుదామని అన్నారు దిల్ రాజు. డిజె మీద నెగటివ్ రావడం వల్ల నిర్మాత దిల్ రాజు ఎప్పుడు లేనిది చాలా హాట్ హాట్ గా మాట్లాడటం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus