అన్ని రంగాల్లో మాదిరి సినిమా ఇండస్ట్రీలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు డేట్స్ సంపాదించగలిగితే వారిదే సినిమా. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు.. సరైన ప్రయత్నాలు చేయడంలో తెలివిగా వ్యవహరించాలి. తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. విజయ్ తో సినిమాలు తీసిన లోకేష్ కనగరాజ్ తోనే తెలుగు ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ ప్రాజెక్ట్ విషయంలో విజయ్ నుండి కన్ఫర్మేషన్ తీసుకోలేకపోయారు.
ఇలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజు మధ్యలో ఎంటర్ అయ్యాడు. విజయ్ మేనేజర్ తో నిత్యం టచ్ లో ఉంటూ.. చెన్నై వెళ్లొస్తూ.. సైలెంట్ గా విజయ్ డేట్స్ పట్టేశాడు. ఈ విషయం బయటకి వస్తే మైత్రి సంస్థ అప్రమత్తం అవుతుందని వీలైనంత సీక్రెట్ గా ఉంచారు. ఫైనల్ గా విజయ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత బయటకి ఫీలర్లు వదిలారు. కరోనా సమయం కావడంతో ఆర్భాటంగా ప్రకటించే కంటే.. లీక్ ఇస్తే బెటర్ అని ఆ విధంగా చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ అనుకున్న ప్రాజెక్ట్ ను దిల్ రాజు వర్కవుట్ చేసి అందరికీ షాకిచ్చాడు. ఇప్పట్లో మైత్రికి విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ రాదు. ఎందుకంటే ముందుగా కమిట్ అయిన తమిళ సినిమాలు పూర్తి చేయాలి. ఆ తరువాత దిల్ రాజు సినిమా చేస్తాడు. ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమా చేసిన తరువాత మళ్లీ వెంటనే ఇక్కడ సినిమా చేసే ఛాన్స్ లేదు. కోలీవుడ్ లో మరో రెండు, మూడు సినిమాలు చేసాక కానీ తెలుగులో సినిమా చేయరు. ఈ లెక్కన చూస్తే మైత్రి వారికి వెయిటింగ్ తప్పేలా లేదు!