‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ లో చిరంజీవి.. ఓ మాటని పదే పదే చెబుతూ వచ్చారు. అదేంటి అంటే.. ‘దర్శకుడు బాబీ ఈ సినిమాని అనుకున్న బడ్జెట్ లో తీశాడు. మహా అయితే ఒక 10 నిమిషాల సినిమా ఎక్కువ తీసి ఉంటాడు అంతే..! ఇదంతా ఎలా చేశాడు అని అడిగితే.. అతను షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే స్క్రిప్ట్ దశలో.. పేపర్ల రూపంలో వేస్ట్ చేశాడేమో కానీ సెట్స్ పైకి వెళ్ళాక మాత్రం అనవసరమైన సీన్లు చిత్రీకరించింది లేదు.
ప్రతి దర్శకుడు బాబీలా ఆలోచించి నిర్మాత ఇచ్చిన బడ్జెట్ లో కనుక సినిమాని ఫినిష్ చేసి.. మరీ ముఖ్యంగా అనుకున్న టైంలో సినిమాని కంప్లీట్ చేయగలిగితే మాత్రం అది దర్శకుడి మొదటి సక్సెస్’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. నిజమే చిరు మాటల్లో నిజం ఉంది కానీ అందుకు చిరులా సహకరించే స్టార్ హీరోలు కూడా ఉండాలి కదా అనేది ఇండస్ట్రీ మాట. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే కనుక.. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ – చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఏడాదిన్నర కావస్తుంది. అయినా షూటింగ్ పార్ట్ 60 శాతం కూడా కంప్లీట్ కాలేదు. పైగా బడ్జెట్ కూడా రూ.75 కోట్లు పెరిగింది. ముందుగా ఈ సినిమా బడ్జెట్ ను రూ.250 కోట్లు అనుకున్నారట. కానీ ఇప్పుడు ఇప్పుడు అది రూ.325 కోట్లు దాటిందని వినికిడి. నిర్మాత దిల్ రాజుకు ఈ ప్రాజెక్టు అదనపు భారంగా తయారయ్యింది. అయితే అదనంగా ఖర్చైన ఆ రూ.75 కోట్లను… ఆయన ‘వారసుడు’ సినిమా ద్వారా తీర్చినట్టు భోగట్టా.
విజయ్ కు ఉన్న తమిళ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఫ్యాన్సీ రేటుకు ఆ మూవీ హక్కులు అమ్మేశారు దిల్ రాజు. అయితే ‘వారసుడు’ సినిమాకి కూడా రూ.10 కోట్ల అనవసరమైన పెట్టుబడి పెట్టించాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. గతంలో కూడా ‘వకీల్ సాబ్’ సినిమాకి డబ్బులు అవసరం పడితే ‘వి’ సినిమాని ఓటీటీకి ఫ్యాన్సీ రేటుకు ఇచ్చేశారు దిల్ రాజు. ఆయన భాషలో చెప్పుకోవాలి అంటే ‘ఇది సినిమా.. ఇది బిజినెస్’ అంతే..!
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!