Dil Raju: ఆ సినిమా ఓటీటీ డీల్‌ తేల్చని దిల్‌ రాజు.. కారణం రిలీజ్‌ డేటేనా?

సినిమా కొబ్బరికాయ కొట్టకముందే ఓటీటీ డీల్స్‌ జరిగిపోతున్న రోజులివి. పెద్ద స్టార్ల సినిమాలకే ఇది ఎక్కువగా జరుగుతుంది అనుకోండి. ఒకవేళ అప్పుడు కాలేదంటే సినిమా రిలీజ్‌కు ముందే అయిపోతుంది. దానికి సంబంధించిన లోగోలు పోస్టర్‌ మీద, టైటిల్స్‌లో కూడా వేసేస్తారు. కానీ ఒక స్టార్‌ హీరో సినిమా విషయంలో స్టార్‌ నిర్మాత ఆసక్తికర నిర్ణయం తీసుకుంటున్నారు అని టాక్‌ నడుస్తోంది. ఆ హీరో వెంకటేశ్‌(Venkatesh)   కాగా.. ఆ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) .

Dil Raju

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)  ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ ఈ సినిమాకు పెడతారు అనే చర్చ జరుగుతోంది. దసరా సందర్భంగా ప్రమోషనల్‌ వీడియోతో ఈ విషయంలో క్లారిటీ ఇస్తారు అని చెబుతున్నారు అనుకోండి. ఈ సినిమా ఓటీటీ డీల్‌ విషయంలోనే దిల్‌ రాజు డేరింగ్‌ స్టెప్‌ వేశారు అంటున్నారు.

నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ఫిక్స్ అయిపోయారు. అనౌన్స్‌మెంట్‌ కూడా దాదాపు చేశారు. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం ఈ సినిమా సమ్మర్‌లో ఉంటే బాగుండు అనే వాదన వినిపిస్తున్నారట. దీంతో దిల్‌ రాజు ఓటీటీ డీల్ ముందు కాకపోయినా ఫర్వాలేదు సినిమాను మాత్రం సంక్రాంతికే తెస్తాను అని ఫిక్స్‌ అయిపోయారట. దీంతో ఓటీటీ డీట్‌ ఇప్పట్లో లేనట్లే అని చెబుతున్నారు.

(F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie)  తర్వాత వెంకటేశ్‌ – అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం వెంకీ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. క్రైమ్‌ డ్రామా విత్‌ ఫ్యామిలీ ట్విస్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెంకీ మాజీ పోలీసు అధికారిగా కనిపిస్తాడు. ఎక్స్‌లెంట్‌ వైఫ్‌గా ఐశ్వర్య (Aishwarya Rajesh) నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి  (Meenakshi Chaudhary)  ఎక్స్‌ లవర్‌గా కనిపించనుంది.

వాళ్లు క్లారిటీ ఇస్తేనే.. నితిన్‌ క్లారిటీ ఇస్తాడట.. అప్పుడు కాకపోతే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus