Robinhood: వాళ్లు క్లారిటీ ఇస్తేనే.. నితిన్‌ క్లారిటీ ఇస్తాడట.. అప్పుడు కాకపోతే..!

పాత విషయమే కానీ.. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలియాలి కాబట్టి చెబుతున్నాం. ఒకప్పుడు టాలీవుడ్‌లో డిసెంబరు నెల డెడ్‌ మంత్‌. అంటే ఆ నెలలో పెద్దగా సినిమాలు వచ్చేవి కావు. అతి పెద్ద సీజన్‌ అయిన సంక్రాంతికి ముందు ఎందుకు అనుకునేవారేమో పెద్దగా సినిమాలు రిలీజ్‌ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు మారింది డిసెంబరులో సినిమాల విడుదల కోసం వెయిటింగ్‌లు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..

Robinhood

ఇప్పుడు హాట్‌ మంత్‌గా మారిన డిసెంబరులో సినిమా రిలీజ్‌ చేద్దాం అనుకున్నా ఇంకా క్లారిటీ ఇవ్వని సినిమా ఒకటి ఉంది. దీంతో ఏమైంది అసలు.. ఎందుకు సినిమా రిలీజ్‌ సంగతి చెప్పడం లేదు అనే ప్రశ్న మొదలైంది. ఆ సినిమా ‘రాబిన్‌ హుడ్‌’ (Robinhood) కాగా.. ఆ హీరో నితిన్‌ (Nithiin)  . వెంకీ కుడుమల (Venky Kudumula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబరులో తెస్తామని ఇప్పటికే చెప్పారు. కానీ క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే..

ఈ డిసెంబరులో అల్లు అర్జున్‌ (Allu Arjun) , సుకుమార్ (Sukumar)ల ‘పుష్ప: ది రూల్‌’ను (Pushpa 2) విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పారు. డిసెంబర్ 6న సినిమా తెస్తాం అని కూడా చెప్పారు. ఈ విషయంలో ఎన్ని పుకార్లు వస్తున్నా మేం వస్తాం అనే అనౌన్స్‌మెంట్ జరుగుతూనే ఉంది. ఇక దిల్‌ రాజు అయితే రామ్‌చరణ్‌ (Ram Charan) – శంకర్‌ల (Shankar) ‘గేమ్‌ ఛేంజర్‌’ను (Game Changer) క్రిస్‌మస్‌కి తీసుకొస్తాం అని చెబుతూనే ఉన్నారు. డిసెంబరు 29 ఆ డేట్‌ అని కూడా అంటున్నారు.

దీంతో ‘రాబిన్‌ హుడ్‌’ (Robinhood) విషయంలో నితిన్‌ అండ్‌ కో. వెయిటింగ్‌ గేమ్‌ ఆడుతున్నారు అని చెబుతున్నారు. అంతేకాదు బాలకృష్ణ (Balakrishna) – బాబీ (Bobby)  సినిమా కూడా డిసెంబరు మీద కన్నేయడమూ ఓ కారణం అని చెబుతున్నారు. అందుకే ఈ మూడు సినిమాల విషయంలో క్లారిటీ వస్తే.. తన సినిమా రిలీజ్‌ డేట్‌ను పక్కాగా ప్రకటించి ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేస్తారు అని అంటున్నారు.

భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus